Vijay Devarakonda: అతను కొడితే విజయ్ దేవరకొండ బ్రెయిన్ షేక్ !

Vijay Devarakonda: డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న ‘లైగర్’ సినిమాలో మైక్ టైసన్ ఓ స్పెషల్ రోల్ లో నటించబోతున్న సంగతి తెలిసిందే. అయితే, మైక్ టైసన్‌ తో తాను కలిసి పని చేయడంపై విజయ్ దేవరకొండ షాకింగ్ కామెంట్స్ చేశాడు. క్లైమాక్స్ కి ముందు వచ్చే ఓ ఫైట్ సన్నివేశంలో మైక్ టైసన్ విజయ్ దేవరకొండ తల పై పంచ్ ఇచ్చాడట. […]

Written By: Shiva, Updated On : April 1, 2022 10:08 am
Follow us on

Vijay Devarakonda: డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న ‘లైగర్’ సినిమాలో మైక్ టైసన్ ఓ స్పెషల్ రోల్ లో నటించబోతున్న సంగతి తెలిసిందే. అయితే, మైక్ టైసన్‌ తో తాను కలిసి పని చేయడంపై విజయ్ దేవరకొండ షాకింగ్ కామెంట్స్ చేశాడు. క్లైమాక్స్ కి ముందు వచ్చే ఓ ఫైట్ సన్నివేశంలో మైక్ టైసన్ విజయ్ దేవరకొండ తల పై పంచ్ ఇచ్చాడట.

Liger

ఆ పంచ్ దెబ్బతో విజయ్ దేవరకొండ బ్రెయిన్ షేక్ అయిందట. ఈ విషయాన్ని విజయ్ దేవరకొండ స్వయంగా చెబుతూ.. ‘టైసన్‌ పంచ్‌నే తట్టుకొని నిలబడగలిగానంటే ఇక దేన్నైనా తట్టుకోగలననే నమ్మకం వచ్చింది’ అని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. మొత్తానికి ఈ సెన్సేషనల్ స్టార్ క్రేజీ కామెంట్స్ చేశాడు.

Also Read: Alia Bhatt: ‘ఆర్ఆర్ఆర్’ వివాదం పై ‘ఆలియా భట్’ స్పందన

Mike Tyson, Vijay Devarakonda

అన్నట్టు.. లైగర్ సినిమాలో మైక్ టైసన్ ఫైట్ సినిమా కథనే మలుపు తిప్పుతుందని.. కీలకమైన ఎమోషనల్ సన్నివేశం కూడా ఈ ఫైట్ సీక్వెన్స్ లోనే ఉండబోతుందని తెలుస్తోంది. పైగా దాదాపు 3 కోట్లు ఖర్చు పెట్టి మరి ఈ సీక్వెన్స్ ను షూట్ చేశారట. కాగా వచ్చే నెలలో ఫస్ట్ వీక్ లోపు ఈ సినిమా ఫస్ట్ కాపీ రెడీ కానుంది. నిజానికి ఎప్పుడో ఈ సినిమా పూర్తి కావాల్సి ఉంది.

అయితే, ఈ సినిమా షూటింగ్ గత రెండేళ్లుగా కరోనా కారణంగా పోస్ట్ ఫోన్ అవుతూనే ఉంది. ఎట్టకేలకు ఈ సినిమా రెడీ కానుంది. విజయ్ దేవరకొండ ఈ సినిమాతో బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ కష్టపడి సిక్స్ ప్యాక్ కూడా చేశాడు. మరి ఆ కష్టానికి ఫలితం దక్కుతుందో లేదో చూడాలి.

సినిమా బిఫోర్ ఫస్ట్ వెర్షన్ కూడా దాదాపు రెడీ అయింది. ఆ ఫస్ట్ వెర్షన్ ను చూసిన సినిమా టీమ్ లోని కొంతమంది సభ్యులు సినిమా అవుట్ ఫుట్ పై పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. వాళ్ళంతా ఈ సినిమా అవుట్ ఫుట్ చాలా బాగా వచ్చిందని అంటున్నారు. అందుకే, లైగర్ తర్వాత కూడా విజయ్ దేవరకొండ పూరితోనే మరో సినిమా చేయడానికి డేట్లు ఇచ్చాడు.

బాలీవుడ్ అగ్ర నిర్మాత కరణ్ జోహార్, ఛార్మి, పూరి జగన్నాథ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూరి అయితే, ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నాడు. ప్రేక్షకులు కూడా ఆ స్థాయి అంచనాలు పెట్టుకుంటే సినిమాకి కలెక్షన్స్ వస్తాయి.

Also Read:  Heroine Gets Cheated: అరెరే.. ఆ హీరోయిన్ని దారుణంగా మోసం చేశారట !

Tags