Wife And Husband: భర్తల మీద అలిగిన భార్యలుంటారు. ఇది సహజమే. కానీ భార్యల మీద అలిగిన భర్తలు మాత్రం అరుదుగానే ఉంటారు. ఆలుమగల గొడవలు కడలిలో అలల్లాంటివని చెబుతారు. పొద్దున్నే గొడవ పడి సాయంత్రం కలుసుకునే చక్రాలే ఆలుమగలు. కానీ ఇక్కడో గమ్మత్తైన విషయం ఉంది. అదేంటంటే ఓ భర్త తన భార్య పెట్టిన షరతులకు భరించలేక ఇల్లు వదిలి ఏకంగా 14 సంవత్సరాలు ఎయిర్ పోర్టునే స్థావరంగా చేసుకుని జీవనం కొనసాగిస్తున్నాడు. భార్య పెట్టిన నిబంధనలకు తలొగ్గకుండా తన ఆత్మాభిమానాన్ని చెదరనివ్వకుండా ఉంటున్నాడు.
చైనాలోని బీజింగ్ కు చెందిన వీజియాంగువో తన భార్యతో వేగలేక ఇంటి నుంచి బయటకు వచ్చేశాడు. తనకు నలభై ఏళ్ల వయసులో చేస్తున్న ఉద్యోగం పోయింది. దీంతో సిగరెట్, మందుకు అలవాటయ్యాడు. దీంతో ఇంట్లోని వారు అతడిని అసహ్యించుకోవడం మొదలుపెట్టారు. నువ్వు ఇంట్లో ఉండాలంటే సిగరెట్, మందు మానేయాలని చెప్పారు. దీంతో అతడు ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. ఇప్పుడు ఆయన వయసు 60 సంవత్సరాలు.

అయితే జియాంగువో 14 ఏళ్లుగా కుటుంబంతో సంబంధం లేకుండా ఒంటరిగానే జీవిస్తున్నాడు. 2008లో భార్యతో విభేదించి బయటకు వచ్చిన అతడు బీజింగ్ ఎయిర్ పోర్టును స్థావరంగా చేసుకున్నాడు. అక్కడే మకాం ఏర్పాటు చేసుకున్నాడు. ఎయిర్ పోర్టులోనే మొబైల్ కిచెన్, సామగ్రి, దుప్పట్లు, దస్తులు అన్ని ఓ చోట పెట్టుకుని అక్కడే వంట చేసుకుని తింటున్నాడు.
జియాంగువోను ఎయిర్ పోర్టు నుంచి పంపించేందుకు భద్రతా సిబ్బంది పలుమార్లు ప్రయత్నించినా అతడు వినడం లేదు. ఇంటి దగ్గర విడిచిపెట్టినా మళ్లీ అక్కడకే వస్తున్నాడు. దీంతో మనసు మారితే ఎంతటి వాడైనా అలాగే వ్యవహరిస్తాడనడానికి ఇదే నిదర్శనం. ఇంట్లో విలువ లేదని తెలిస్తే ఎంతటి సాహసానికి ఒడిగట్టి తాననుకున్నది చేయడం తెలిసిందే. జియాంగువో జీవనం అందరికి ఆశ్చర్యం కలిగిస్తోంది.
మొత్తానికి జియాంగువో జీవితం అందరికి కొత్తగా అనిపించినా పలువురు ఆయన తీరుపై ముక్కున వేలేసుకుంటున్నారు. ఇన్నాళ్లుగా ఎయిర్ పోర్టులోనే ఉంటూ తన భార్యా పిల్లలకు దూరం జరగడంతో ఆయనకు ఎంత బాధ అనిపించిందో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో జియాంగువో భవిష్యత్ లో అక్కడే నివాసం ఏర్పాటు చేసుకుని తన బతుకు అక్కడే ముగిస్తాడని చెబుతున్నారు.
[…] Ts High Court: తెలంగాణ హైకోర్టు సంచలనాత్మక తీర్పు వెలువరించింది. ఓ బాలిక విషయంలో కోర్టు ఆమెకు అనుకూలంగా తీర్పు చెప్పింది. కేసు వివరాలు పరిశీలిస్తే బంజారాహిల్స్ కు చెందిన ఓ బాలిక(15) అవాంఛిత గర్భం దాల్చింది. దీంతో ఆమె గర్భ విచ్చిత్తికి అనుమతి ఇవ్వాలని కోర్టును ఆశ్రయించడంతో కోర్టు ఓకే చెప్పింది. బాలిక విషయంలో కోర్టు తీర్పుపై అందరు హర్షం వ్యక్తం చేశారు. అభం శుభం తెలియని బాలికను శారీరకంగా లోబరుచుకుని లైంగిక వాంఛలు తీర్చుకోవడంతో ఆమె గర్భం దాల్చింది. వయసు రీత్యా ఆరోగ్య కారణాల చేత గర్భవిచ్చిత్తికి అవకాశం కల్పించాలని కోర్టును అభ్యర్థించడంతో కోర్టు సానుకూలంగా స్పందించింది. […]