Heroine Regina : అందంతో పాటు అభినయం కూడా కలిగిన హీరోయిన్స్ మన సౌత్ లో నేటి తరంలో చాలా తక్కువమంది ఉంటారు. ఆ తక్కువమంది హీరోయిన్స్ లో ఒకరు రెజీనా కాసాండ్రా. ఈమె తెలుగులో ‘శివ మనసులో శృతి’ అనే చిత్రం ద్వారా మన ఆడియన్స్ కి పరిచయమైంది. ఈ సినిమా తర్వాత ఆమె వరుసగా మీడియం రేంజ్ హీరోలతో కలిసి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. కేవలం తెలుగుకి మాత్రమే పరిమితం కాకుండా హిందీ, తమిళంలో కూడా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపుని తెచ్చుకుంది. అయితే కొత్త హీరోయిన్స్ రాకతో ఈమెకు హీరోయిన్ గా క్రేజ్ తగ్గడంతో, ఇప్పుడు కేవలం నటనకి ప్రాధాన్యత ఉన్న పాత్రలే చేస్తుంది. అందులో భాగంగా లేడీ విలన్ గా ఈమధ్య బాగా పాపులర్ అవుతుంది. రీసెంట్ గా ఆమె అజిత్ హీరో గా నటించిన ‘విడాముయార్చి’ చిత్రంలో విలన్ గా నటించింది.
ఈ చిత్రానికి ముందు ఆమె ‘7’,’ఎవరు’, ‘చక్ర’ వంటి చిత్రాల్లో పూర్తి స్థాయి నెగటివ్ రోల్స్ లో కనిపించి మంచి మార్కులు కొట్టేసింది. ఇప్పుడు మళ్ళీ ఆమె మరోసారి నెగటివ్ రోల్ లో కనిపించనుంది. కానీ ఈసారి ఏకంగా అజిత్ లాంటి సూపర్ స్టార్ సినిమాలో నెగటివ్ రోల్ చేయడంతో ఆమెకి మరింత రీచ్, క్రేజ్ రావొచ్చు. ఈ సినిమా ప్రొమోషన్స్ లో భాగంగా ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ప్రముఖ తమిళ హీరో శివ కార్తికేయన్ గురించి మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఆమె మాట్లాడుతూ ‘శివ కార్తికేయన్ తో కలిసి నేను తమిళంలో ‘కేడి బిల్లా..కిల్లాడి రంగా’ అనే చిత్రంలో నటించాను. అప్పటికీ ఇప్పటికీ శివ కార్తికేయన్ చాలా మార్పులు వచ్చాయి. ఇప్పుడు ఆయన తమిళంలోనే పెద్ద స్టార్ హీరో అయిపోయాడు’.
‘శివ కార్తికేయన్ ఈ రేంజ్ కి వస్తాడని నేను అసలు ఊహించలేదు. ఎందుకంటే సినీ ఇండస్ట్రీ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజ్ లేకుండా ఎదగడమంటే సాధారణమైన విషయం కాదు. శివ కార్తికేయన్ చిన్న స్థాయి నుండి నేడు సౌత్ లో బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ లో ఒకడిగా మారిపోవడం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. కానీ శివలో అప్పటికీ, ఇప్పటికీ మారనిది ఒక్కటే, అది ఆయన స్వభావం. అప్పట్లో ఎలా ఉండేవాడో, ఇప్పటికీ అలాగే ఉంటున్నాడు. ఇంత స్థాయికి వచ్చిన తర్వాత కూడా అతనిలో ఎలాంటి స్వార్థం లేదు’ అంటూ చెప్పుకొచ్చింది. ఇది ఇలా ఉండగా విడాముయార్చి చిత్రం తెలుగు లో ‘పట్టుదల’ అనే టైటిల్ తో విడుదల కాబోతుంది. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ కి ఇప్పటికే అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. తమిళంలో ఈ చిత్రం ఆల్ టైం రికార్డు నెలకొల్పే రేంజ్ లో బుకింగ్స్ ఉన్నట్లుగా చెప్తున్నారు ట్రేడ్ పండితులు.