Rakshit Shetty: రక్షిత్ శెట్టి-రష్మిక మందాన లవ్ ఎఫైర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. రష్మిక డెబ్యూ మూవీ కిరిక్ పార్టీ. 2016లో విడుదలైన ఈ కన్నడ చిత్రంలో రక్షిత్ శెట్టి-రష్మిక మందాన జంటగా నటించారు. కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. కిరిక్ పార్టీ సూపర్ హిట్ అయ్యింది. ఈ మూవీ సెట్స్ లో రష్మిక, రక్షిత్ శెట్టి లవ్ లో పడ్డారు. తమ బంధం శాశ్వతం చేసుకోవాలని పెళ్లికి సిద్ధమయ్యారు. గ్రాండ్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. మరికొద్ది రోజుల్లో వివాహం జరగాల్సి ఉండగా రష్మిక మనసు మార్చుకుంది.
పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది. రక్షిత్ శెట్టికి బ్రేకప్ చెప్పింది. కన్నడ పరిశ్రమలో ఆమెపై వ్యతిరేకత వ్యక్తం కాగా టాలీవుడ్ కి చెక్కేసింది. కాలం కలిసొచ్చి స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఇక రక్షిత్ శెట్టి కన్నడలో వరుసగా సినిమాలు చేస్తున్నాడు. గత ఏడాది విడుదలైన చార్లీ 777 తెలుగులో కూడా విజయం సాధించింది. ఇటీవల సప్త సాగరాలు దాటి చిత్రంతో ప్రేక్షకులను పలకరించాడు.
సప్త సాగరాలు దాటి చిత్రానికి సీక్వెల్ కూడా ఉంది. ఇది నవంబర్ 17న విడుదల కానుంది. ఈ క్రమంలో ఆయన ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. మాటల్లో మాటగా రష్మిక కంటే ముందు మరో అమ్మాయిని ప్రేమించినట్లు రక్షిత్ శెట్టి వెల్లడించారు. ఇంజనీరింగ్ చదివే రోజుల్లో ఓ అమ్మాయిని రక్షిత్ శెట్టి ఇష్టపడ్డాడట. ఆమె అమ్మాయికి తన ప్రేమ తెలియజేస్తూ లవ్ లెటర్స్ రాశాడట. అయితే అవి స్వయంగా ఇవ్వకుండా బెస్ట్ ఫ్రెండ్ కి ఇచ్చి ఆ అమ్మాయికి ఇవ్వమనేవాడట.
రెండేళ్లకు కూడా ఆ అమ్మాయిలో ఎలాంటి చలనం కనిపించలేదట. ఎందుకంటే రక్షిత్ శెట్టి రాసిన లవ్ లెటర్స్ ఆ అమ్మాయికి చేరలేదట. ఫ్రెండ్ మోసం చేసి ఆ లెటర్స్ ఇవ్వలేదట. తీరా చూస్తే అతడు ఆ అమ్మాయిని లైన్లో పెట్టి పెళ్లి చేసుకున్నాడట. క్లోజ్ ఫ్రెండ్ చీటింగ్ వలన నచ్చిన అమ్మాయిని మిస్ అయ్యానని రక్షిత్ శెట్టి వెల్లడించాడు. రష్మిక చూస్తే అలా హ్యాండ్ ఇచ్చింది. చూస్తుంటే రక్షిత్ శెట్టికి లవ్ ఎఫైర్స్ కలిసి రావడం లేదనే మాటవిన్పిస్తుంది.