https://oktelugu.com/

OKtelugu MovieTime : వైరల్ అవుతున్న టుడే క్రేజీ అప్ డేట్స్

OKtelugu MovieTime:  మూవీ టైమ్ నుంచి ప్రజెంట్ టాలీవుడ్ అప్ డేట్స్ విషయానికి వస్తే.. సినిమాల్లో పేరు తెచ్చుకుని రాజకీయాల్లోకి వచ్చి చక్రం తిప్పిన చాలామందిని మనం చూశాం. యడియూరప్ప ఇందుకు భిన్నంగా రాజకీయాల్లో ఆరితేరి ఇప్పుడు ముఖానికి రంగేసుకుంటున్నారు. ‘తనుజ’ అనే ఓ రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలో యడ్డీ సీఎంగా నటిస్తున్నారు. హరీశ్ ఎండీ హళ్లి ఈ మూవీకి దర్శకుడు. మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ విషయానికి వస్తే.. విజయ్, పూజా హెగ్డేలు […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : February 21, 2022 / 12:46 PM IST
    Follow us on

    OKtelugu MovieTime:  మూవీ టైమ్ నుంచి ప్రజెంట్ టాలీవుడ్ అప్ డేట్స్ విషయానికి వస్తే.. సినిమాల్లో పేరు తెచ్చుకుని రాజకీయాల్లోకి వచ్చి చక్రం తిప్పిన చాలామందిని మనం చూశాం. యడియూరప్ప ఇందుకు భిన్నంగా రాజకీయాల్లో ఆరితేరి ఇప్పుడు ముఖానికి రంగేసుకుంటున్నారు. ‘తనుజ’ అనే ఓ రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలో యడ్డీ సీఎంగా నటిస్తున్నారు. హరీశ్ ఎండీ హళ్లి ఈ మూవీకి దర్శకుడు.

    yediyurappa

    మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ విషయానికి వస్తే.. విజయ్, పూజా హెగ్డేలు నటించిన బీస్ట్ మూవీ నుంచి విడుదలైన అరబిక్ కుతు సాంగ్ రికార్డులు సృష్టిస్తోంది. 48 గంటల్లోనే టాప్ సాంగ్స్‌ లిస్టులో చోటు దక్కించుకుంది. త్వరలోనే 70 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసేందుకు రెడీగా ఉంది. అనిరుధ్ కంపోజ్ చేసిన ఈ పాటకు హీరో శివ కార్తికేయన్ లిరిక్స్ అందించారు. ఏప్రిల్ 14న సినిమాను విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

    Also  Read:  ఏపీ ఐటీ, ప‌రిశ్ర‌మల శాఖ మంత్రి గౌత‌మ్ రెడ్డి గుండెపోటుతో మృతి

     

    beast

    మరో అప్ డేట్ ఏమిటంటే.. టాలీవుడ్ ప్రముఖుల సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. సినీ పరిశ్రమ, కార్మికుల సంక్షేమంపై చర్చ జరిగింది. టాలీవుడ్ సమస్యలపై ఇరువురు సీఎంలను కలవడంపైనా చర్చించారు. రాజమౌళి, తమ్మారెడ్డి భరద్వాజ, మురళీమోహన్, రాజేంద్రప్రసాద్, నట్టికుమార్, సి.కళ్యాణ్ తదితరులు హాజరయ్యారు.

    Rajamouli

    కాగా చర్చలు సానుకూలంగా సాగాయని నట్టి కుమార్ తెలిపారు. ఇక నుంచి పరిశ్రమ నిర్ణయాలన్నీ ఫిలిం చాంబర్ ద్వారా జరుగుతాయన్నారు. మరి ఈ టాలీవుడ్ సమావేశం కారణంగా ఎవరికీ ఎలాంటి మేలు జరుగుతుందో చూడాలి. గతంలో కూడా ఇలాంటి సమావేశాలు చాలా జరిగాయి. కానీ, ఎలాంటి ఉపయోగం లేదు.

    Also  Read: వైరల్ అవుతున్న కళావతి పాటకు సితార స్టెప్పులు

    Tags