https://oktelugu.com/

Rashmika Mandanna: ప్రాణ భయంతో హీరోయిన్ రష్మిక..భారీ సెక్యూరిటీ ఏర్పాటు..అసలు ఏమి జరిగిందంటే!

ఇదంతా పక్కన పెడితే ఈ సల్మాన్ ఖాన్ గత కొంత కాలంగా లారెన్స్ బిష్ణోయ్ అనే వ్యక్తి నుండి బెదిరింపు కాల్స్ అందుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం లారెన్స్ ని అరెస్ట్ చేసారు పోలీసులు.

Written By:
  • Vicky
  • , Updated On : October 24, 2024 / 04:49 PM IST

    Rashmika Mandanna

    Follow us on

    Rashmika Mandanna: ప్రముఖ స్టార్ హీరోయిన్ రష్మిక మందన కి ప్రాణ హాని ఉన్నందున ఆమెకు సెక్యూరిటీ భారీగా పెంచేశారు. షూటింగ్స్ కి కూడా ఆమె ఫుల్ సెక్యూరిటీ తోనే హాజరు అవుతుంది. ఆమె ఇంటి బయట కూడా సెక్యూరిటీ పెట్టారు. రష్మిక ఏ వివాదం లో చిక్కుకుందని ఇంత సెక్యూరిటీ పెట్టారు..?, ఆమెకు ఎందుకు ప్రాణహాని ఉంది..?, ఆమెని ఎవరు బెదిరించారు?, అసలు ఏమి జరుగుతుంది అని మీరంతా అనుకోవచ్చు. పూర్తి వివరాల్లోకి వెళ్తే రష్మిక ప్రస్తుతం బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ తో కలిసి ‘సికందర్’ అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. ప్రముఖ తమిళ దర్శకుడు AR మురగదాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి నెలలో విడుదల కాబోతుంది.

    ఇదంతా పక్కన పెడితే ఈ సల్మాన్ ఖాన్ గత కొంత కాలంగా లారెన్స్ బిష్ణోయ్ అనే వ్యక్తి నుండి బెదిరింపు కాల్స్ అందుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం లారెన్స్ ని అరెస్ట్ చేసారు పోలీసులు. అయినప్పటికీ కూడా అతని అనుచరుల నుండి సల్మాన్ ఖాన్ కి బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయనకీ పోలీస్ శాఖ సెక్యూరిటీని భారీ రేంజ్ లో పెంచింది. ప్రస్తుతం ఆయన బిగ్ బాస్ 18 షో షూటింగ్ కి కానీ, ‘సికందర్’ మూవీ షూటింగ్ కి కానీ భారీ బందోబస్తుతోనే వస్తున్నాడు. కేవలం ఆయనకి మాత్రమే కాదు, షూటింగ్ లో పాల్గొంటున్న తన తోటి నటీనటులకు కూడా సల్మాన్ ఖాన్ భారీ సెక్యూరిటీ ని ఏర్పాటు చేయించాడు. అందులో భాగంగానే రష్మిక కి కూడా సెక్యూరిటీ పెట్టించాడు. ఈమె కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేసాడు సల్మాన్ ఖాన్. ముంబై లో షూటింగ్ ఎన్ని రోజులు జరిగితే అన్ని రోజులు తన స్పెషల్ గెస్ట్ హౌస్ లో రష్మిక ని ఉంచుతున్నాడట.

    ఆమెకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా మహారాణి లాగా చూసుకుంటున్నాడట. అంతే కాదు తనకి ఎంత సెక్యూరిటీ అయితే ఉంటుందో, అంత సెక్యూరిటీ ని గెస్ట్ లో ఉంటున్న రష్మిక కోసం కూడా ఏర్పాటు చేయించాడట. సల్మాన్ ఖాన్ తో పని చేస్తున్న హీరోయిన్ కాబట్టి, లారెన్స్ బిష్ణోయ్ అనుచరులు ఆమెని కిడ్నాప్ చేసి బెదిరించే అవకాశాలు ఉన్నందున, ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలిసింది. ఇదంతా పక్కన పెడితే సల్మాన్ ఖాన్ రీసెంట్ గానే ‘సింగం రిటర్న్స్’ మూవీ షూటింగ్ లో పాల్గొన్నాడు. ఈ చిత్రంలో చిన్న అతిథి పాత్రలో ఆయన కనిపించనున్నాడు. ఇంతటి కష్టమైన సమయంలో కూడా సల్మాన్ ఖాన్ ఇచ్చిన మాట కోసం వచ్చి షూటింగ్ లో పాల్గొన్నందుకు ఆ సినిమాలో హీరో గా నటిస్తున్న అజయ్ దేవగన్ ఎంతో సంతోషిస్తూ కృతఙ్ఞతలు తెలిపాడు. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియా లో బాగా వైరల్ గా మారింది.