https://oktelugu.com/

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ హౌస్లోకి ఆ పార్టీలో పట్టుబడ్డ హీరోయిన్… సంచలనం రేపుతున్న న్యూస్!

ఓ కాంట్రవర్సియల్ యంగ్ హీరోయిన్ బిగ్ బాస్ హౌస్లో కి వెళుతున్నట్లు సమాచారం అందుతుంది. ఒకటి రెండు సందర్భాల్లో డ్రగ్ ఆరోపణలు ఎదుర్కొన్న ఆ నటి బిగ్ బాస్ తెలుగు 8 కంటెస్టెంట్ గా ఎంపిక అయ్యారట. ఆమె ఎవరో చూద్దాం.

Written By:
  • NARESH
  • , Updated On : July 26, 2024 / 07:52 PM IST

    Kushita Kallapu

    Follow us on

    Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 త్వరలో ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన ప్రోమో కూడా రిలీజ్ చేశారు మేకర్స్. దీంతో బిగ్ బాస్ సీజన్ 8 పై మరింత ఆసక్తి పెరిగింది. ఎప్పుడెప్పుడు బిగ్ బాస్ ప్రారంభం అవుతుంది అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం స్టార్ మా ఛానల్ లో కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ అనే గేమ్ షో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ షో ఆగస్టు నెలాఖరుకు ముగియనుంది. ఇక ఆ వెంటనే బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ చేస్తారని సమాచారం.

    సెప్టెంబర్ మొదటి వారంలో సీజన్ 8 లాంచింగ్ ఎపిసోడ్ ఉంటుందని తెలుస్తుంది. ఈసారి హౌస్ లో కి వచ్చే కంటెస్టెంట్స్ ఎవరనే ఆసక్తి నెలకొంది. ఇప్పటికే కొందరు పేర్లు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. గత సీజన్ మాదిరిగా షో ని రక్తికట్టించే విధంగా కంటెస్టెంట్స్ ని ఏరికోరి ఎంపిక చేస్తున్నారట. అన్నపూర్ణ స్టూడియోస్ లో బిగ్ బాస్ సెట్ వర్క్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఇక కంటెస్టెంట్స్ ఎంపికకు సంబంధించి వారికి కాల్స్ చేయడం వంటి పనులు పూర్తి చేస్తున్నారు.

    సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కంటెస్టెంట్స్ లిస్ట్ పరిశీలిస్తే .. యాంకర్ రీతూ చౌదరి, కిర్రాక్ ఆర్పీ, వేణు స్వామి, యాదమరాజు, బుల్లెట్ భాస్కర్, సురేఖ వాణి, అమృత ప్రణయ్, యూట్యూబర్ బంచిక్ బబ్లు, బర్రెలక్క, నటి హేమ, సోనియా సింగ్, శ్వేతా నాయుడు, కుమారి ఆంటీ, యాంకర్ విష్ణు ప్రియ ఇలా చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ లిస్ట్ లో మరో యువ నటి పేరు తెలుస్తుంది. ఆమె ఎవరో కాదు కుషిత కల్లపు. సోషల్ మీడియాలో అమ్మడి ఫాలోయింగ్ మాములుగా ఉండదు.

    టిక్ టాక్ వీడియోలు చేస్తూ అప్పట్లో బాగా ట్రెండ్ అయింది. ఆ తర్వాత యూట్యూబ్ లో షాట్ ఫిలిమ్స్ లో నటించింది. ఆ విధంగా పాపులారిటీ పెంచుకుంటూ సినిమాల్లో అవకాశాలు కూడా దక్కించుకుంటుంది. అయితే ఇప్పుడు కుషిత బిగ్ బాస్ సీజన్ 8 లో పార్టిసిపేట్ చేయనుంది అని న్యూస్ వైరల్ అవుతుంది. ఆమె కంటెస్టెంట్ గా రావడం దాదాపు కన్ఫర్మ్ అయినట్లే అంటున్నారు. కానీ లాంచింగ్ ఎపిసోడ్ తర్వాతే ఆమె ఎంట్రీ పై ఫుల్ క్లారిటీ వస్తుంది. కుషిత కల్లపు ఇటీవల బిగ్ బాస్ ఫేమ్ అర్జున్ కళ్యాణ్ హీరోగా నటించిన బాబు సినిమాలో హీరోయిన్ గా చేసింది.

    కాగా రెండేళ్ల క్రితం రాడిసన్ హోటల్ లో గల పుడ్డింగ్ అండ్ మింక్ పబ్ పై రైడ్ జరిగింది. లేట్ నైట్ పార్టీ జరుగుతుండగా… నిషేదిత డ్రగ్స్ వాడుతున్నారనే సమాచారం పై పోలీసులు రైడ్ చేసి పలువురు ప్రముఖులను అదుపులోకి తీసుకున్నారు. వారిలో కుషిత కల్లపు కూడా ఒకరు. డ్రగ్ పార్టీలో పాల్గొన్నారన్న ఆరోపణలను అనంతరం కుషిత ఖండించారు.

    మేము పబ్ కి వెళ్లిన 20 నిమిషాల్లో పోలీసులు వచ్చారు. మమ్మల్ని అదుపులోకి తీసుకున్నారు. మా వివరాలు అడిగారు. కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు. మేము కనీసం డ్రింక్ కూడా చేయలేదు. కేవలం ఛీజ్ బజ్జీలు తిని వచ్చామని కుషిత కల్లపు ఓ మీడియా ఛానల్ తో మాట్లాడుతూ వివరణ ఇచ్చారు. ఒకటి రెండు డ్రగ్ కేసుల్లో కుషిత కల్లపు, ఆమె సిస్టర్ లిషి గణేష్ పేర్లు తెరపైకి రావడమైంది.