Janhvi Kapoor : అందాల తార, ఎవర్గ్రీన్ బ్యూటీ, దివంగత శ్రీదేవి కూతురిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన జాన్వీ కపూర్ కి నిన్న మొన్నటి వరకు బాలీవుడ్ లో ఎంత బ్యాడ్ టైం నడిచిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఏ ముహూర్తం లో ఆమె ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిందో తెలియదు కానీ, అక్కడ చేసిన ప్రతీ సినిమా డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. దీంతో తెలుగు సినిమా ఇండస్ట్రీ కి షిఫ్ట్ అయిన ఆమె ‘దేవర’ చిత్రంతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు ఆమె రామ్ చరణ్, బుచ్చి బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా కూడా ఆమె కెరీర్ లో మైలు రాయిగా నిలిచిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రీసెంట్ గానే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ఇదంతా పక్కన పెడితే జాన్వీ కపూర్ నార్త్ ఇండియన్ కల్చర్ లో చిన్నప్పటి నుండి పెరిగిన అమ్మాయి అనే విషయం మన అందరికీ తెలిసిందే.
అక్కడ ఈమె పార్టీ కల్చర్ కి బాగా అలవాటు పడింది. శ్రీదేవి బ్రతికి ఉన్నన్ని రోజులు ఈమె చాలా జాగ్రత్తగా, పద్దతి గా ఉండేది కానీ, ఆమె చనిపోయిన తర్వాత మాత్రం తన ఇష్టారాజ్యంగా బ్రతుకుతుంది. ఇప్పటికే ఈమె బాలీవుడ్ లో అనేకమంది తో డేటింగ్ చేసింది అంటూ వార్తలు వినిపించాయి. తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఈమె అనేక ఫోటోలు కూడా దిగుతూ అప్పట్లో తన ఇంస్టాగ్రామ్ లో అప్లోడ్ చేసింది. కానీ ఇప్పుడు అతనితో బ్రేకప్ జరిగి చాలా రోజులైంది. అయితే ఈమె ప్రముఖ క్రికెటర్ హార్థిక్ పాండ్య తో డేటింగ్ చేస్తుందని, వీళ్లిద్దరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ సోషల్ మీడియా లో వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే ఈమధ్య కాలంలో ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ ని ఉపయోగించి ఫేక్ ఎడిటింగ్ ఫోటోలను చాలానే చేస్తున్నారు నెటిజెన్స్.
అలా జాన్వీ కపూర్, హార్థిక్ పాండ్య కలిసి డేటింగ్ చేస్తున్నట్టు, మాల్దీవ్స్ లో ఇద్దరు ఎంజాయ్ చేస్తున్నట్టు కొన్ని ఫోటోలను ఎడిట్ చేసి సోషల్ మీడియా లో అప్లోడ్ చేయగా అవి తెగ వైరల్ గా మారింది. ఈ ఫోటోలను చూస్తే ఎవ్వరూ కూడా వాటిని ఫేక్ అని అనుకోరు, అంత సహజంగా ఉన్నాయి అవి. ఇలా ఫేక్ ఎడిటింగ్ చేసిన వారిపై ఇరువురి సెలెబ్రిటీల అభిమానులు మండిపడ్డారు. ఇలా చేయడం సరికాదు, రోజురోజుకి ఈ టెక్నాలజీ చాలా డేంజర్ గా తయారైంది. భవిష్యత్తులో ఇలాంటివి మరికొన్ని జరగకుండా ఉండాలంటే కచ్చితంగా కొన్ని పరిమితులు ఈ టెక్నాలజీ మీద పెట్టాల్సిన అవసరం ఉందని చాలా కాలం నుండి సోషల్ మీడియా లో డిమాండ్స్ వినిపిస్తున్నాయి. మరి దీనిపై ప్రభుత్వాలు అయినా చర్యలు తీసుకుంటాయా లేదా అనేది చూడాలి.