Sainik School Admission: : AISSEE 2025: పిల్లలను మంచి పాఠశాలలో చేర్పించడం చాలా అవసరం. కానీ ప్రస్తుతం స్కూల్స్ ఫీజును చూస్తుంటే మాత్రం భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. మరి కాస్త దీని నుంచి రిలీఫ్ పొందాలి అంటే కొన్ని మంచి స్కూల్స్ ను ఎంచుకోవాలి. ఇక మీకు సైనిక్ స్కూల్స్ గురించి తెలుసా? అయితే వచ్చే ఏడాది అడ్మిషన్ల ప్రక్రియ ఇప్పుడు ప్రారంభమైంది. సైనిక్ స్కూల్‌లో 6 నుంచి 9 తరగతుల్లో చేరేందుకు ఆన్‌లైన్ దరఖాస్తు తేదీ విడుదలైంది. మరి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇక ఈ నోటిఫికేషన్ కు ఆన్‌లైన్ దరఖాస్తులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జనవరి 13, 2025 వరకు తీసుకోనుంది.
దరఖాస్తు చేయడానికి దశలు:
step 1: అధికారిక వెబ్‌సైట్ aissee.nta.nic.inని సందర్శించండి
step 2. హోమ్‌పేజీలో, రిజిస్ట్రేషన్ లింక్ పై క్లిక్ చేయండి.
step 3. ఆ తర్వాత మీరే నమోదు చేసుకోవాలి. లాగిన్ ఆధారాలను రూపొందించాలి.
step 4. లాగిన్ చేసి, AISSEE దరఖాస్తు ఫారమ్‌ను పూరించాల్సి ఉంటుంది.
step 5. అవసరమైన పత్రాలు, ఫోటోలను అప్‌లోడ్ చేయండి. ఆన్‌లైన్ చెల్లింపు చేయండి.
step 6. సబ్మిట్‌పై క్లిక్ చేసి దరఖాస్తు ఫారమ్‌ను సేవ్ చేసుకోండి.
step 7. భవిష్యత్ సూచన కోసం హార్డ్ కాపీని తీసుకోవడం మర్చిపోవద్దు.
VI తరగతిలో ప్రవేశానికి అర్హత
అయితే అభ్యర్థుల వయస్సు 31 మార్చి 2023 నాటికి 10 నుంచి 12 సంవత్సరాల మధ్య ఉండాలి. అన్ని సైనిక్ పాఠశాలల్లో బాలికలకు అడ్మిషన్ VI తరగతిలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆమోదించబడిన కొత్త సైనిక్ పాఠశాలల్లో ప్రవేశానికి సంబంధించిన వివరణాత్మక అర్హత ప్రమాణాలు కూడా కొన్ని పొందుపరచారు.
IX తరగతిలో ప్రవేశానికి అర్హత
అభ్యర్థి వయస్సు మార్చి 31, 2025 నాటికి 13 నుంచి 15 సంవత్సరాల మధ్య ఉండాలి. అడ్మిషన్ సమయంలో, వారు గుర్తింపు పొందిన పాఠశాల నుంచి 8వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. 9వ తరగతిలో బాలికల ప్రవేశం ఖాళీల లభ్యతకు లోబడి ఉంటుంది. బాలికల వయస్సు ప్రమాణాలు అబ్బాయిల మాదిరిగానే ఉంటాయి.
జనరల్, ఓబీసీ (ఎన్‌సీఎల్), డిఫెన్స్, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు రిజిస్ట్రేషన్ ఫీజు రూ. 800 కాగా, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు రూ.650 చెల్లించాల్సి ఉంటుంది. 6, 9 తరగతులకు ఎంట్రీ కోసం ఈ AISSEE 2025 ను నిర్వహిస్తున్నారు. దీని ద్వారా విద్యార్థులు CBSEకి అనుబంధంగా ఉన్న ఇంగ్లీష్ మీడియం రెసిడెన్షియల్ పాఠశాలల్లో ప్రవేశం పొందే అవకాశం కూడా ఉంటుంది.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు..