spot_img
Homeలైఫ్ స్టైల్Children : పిల్లలకు ఈ రెండు ఫుడ్స్ కచ్చితంగా పెట్టండి ఆరోగ్యంగా ఉంటారు.

Children : పిల్లలకు ఈ రెండు ఫుడ్స్ కచ్చితంగా పెట్టండి ఆరోగ్యంగా ఉంటారు.

Children : శీతాకాలం పూర్తి స్వింగ్‌లో ఉంది కదా. ఈ సమయంలో చిన్న పిల్లల ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ వహించాలి. చల్లని కాలంలో పిల్లల రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడం చాలా ముఖ్యం అండీ బాబూ. కానీ ఈ పనిని ఆహారం ద్వారా సాధించవచ్చు. మీరు కూడా చల్లని కాలంలో మీ పిల్లలకు ఆరోగ్యకరమైన, రుచికరమైన ఏదైనా తినిపించాలనుకుంటే ఈ స్టోరీని చదివేసేయండి. అయితే మీరు మీ పిల్లలకు చలిలో కూడా మంచి ఆహారం ఇవ్వాలి. అలాంటి వంటకాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఓ రెండు వంటకాలను తయారు చేసి పెట్టండి. చాలా మంచిది అంటున్నారు నిపుణులు.

గింజలతో పాలు
దీని కోసం మీరు బాదంపప్పులు- 10, పొట్టు తీసిన పిస్తాపప్పులు- 10, జీడిపప్పులు- 10, యాలకుల పొడి- ½ tsp, జాజికాయ పొడి- ¼ – ½ tsp, కుంకుమపువ్వు – 2-3, పాలు, 1 కప్పు, పంచదార- రుచి కి సరిపడా తీసుకోవాలి. వీటన్నింటిని తీసుకొని పౌడర్ వచ్చేలా మిక్సర్‌లో కలపండి. ఇందులోనే యాలకుల పొడి, జాజికాయ పొడి వేసి బాగా కలపాలి.

ఈ మిశ్రమాన్ని ఓ గాలి తగలని కంటైనర్ లో స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు బాణలిలో పాలు పోసి కొద్దిగా వేడి చేయాలి కానీ ఎక్కువగా ఉడకనివ్వవద్దు. తర్వాత అందులో పంచదార వేసి బాగా కలపాలి. ఇక ఈ పాలల్లో మీరు రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ ను వేసి కలపాలి. దీంతో పాలు చిక్కగా మారుతాయి. అప్పుడు మీరు మంట నుంచి పాన్ దించి ఒక కప్పులో పాలు పోసి కుంకుమపువ్వు వేసి పిల్లలకు తినిపించండి. దీని వల్ల పిల్లలకు రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మంచి ఆరోగ్యం కూడా.

వెల్లుల్లి వెన్న బ్రోకలీ
బ్రకోలీలో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ రెండూ పిల్లల అభివృద్ధికి ఎంతగానో తోడ్పడతాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకల పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. ఇది కాకుండా, వెల్లుల్లి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శరీరాన్ని ఫ్లూ, జలుబు నుంచి రక్షిస్తుంది.

ఎలా తయారు చేయాలి?
ఈ రెసిపీ చేయడానికి, బ్రోకలీ- 1 బంచ్ లేదా ½ కిలోలు వెల్లుల్లి- 2 లవంగాలు తీసుకోవాలి. ఇక వెన్న – 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు, నల్ల మిరియాలు రుచికి సరిపడా తీసుకోవాలి. బ్రోకలీని తేలికగా ఉప్పు నీరులో వేసి మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. బాణలిలో వెన్న వేసి, వెల్లుల్లిని మెత్తగా అయ్యే వరకు వేయించాలి. ఉడికించిన బ్రోకలీని పాన్‌లో వేసి ఉప్పు, మిరియాలు వేయండి. మీ ఈ వంటకం సిద్ధంగా అయింది. మీరు దీన్ని సర్వ్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ ప్రత్యేక పదార్థం బ్రోకలీ కదా. సో మీకు మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఇది పిల్లలకు మాత్రమే కాకుండా పెద్దలకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

Swathi Chilukuri
Swathi Chilukurihttp://oktelugu
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Most Popular

NEET Protest Delhi: ఢిల్లీలో నీట్ విద్యార్థుల ఆందోళనలు: ఆ సీజేపీ నాయకులు ఎక్కడ..

NEET Protest Delhi: ఒకరేమో ఆర్టికల్ 370 రద్దు చేయాలి అంటారు. మరొకరేమో రాముడి నామాన్ని జపించకూడదు అంటారు. ఇంకొకరేమో జమ్ము కాశ్మీర్ రాష్ట్రానికి మరింత స్వేచ్ఛ వాయువులు కల్పించాలని డిమాండ్...

AI Impact On Education: ఏఐతో మూలాలే మటాష్.. పరిస్థితి ఎంతకు దిగజారిందంటే..

AI Impact On Education: ఏఐ తో ఇప్పటివరకు కేవలం ఐటీ ఉద్యోగాలు మాత్రమే పోయాయని అనుకున్నాం. ఎంట్రీ లెవెల్.. మిడ్ లెవెల్ ఉద్యోగాలు మాత్రమే మటాష్ అయిపోయాయని మీడియా వార్తల్లో...

Rahul Gandhi Injury: రాహుల్ రక్తం కళ్ళ చూశారు.. మోడీకి ఇది మైనస్సే

Rahul Gandhi Injury: మల్లికార్జున కార్గే నిన్న తన పుట్టినరోజు జరుపుకున్నారు.. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్లారు.. పోలీసులు కూడా వారి కేవలం శుభాకాంక్షలు తెలియజేయడానికి మాత్రమే వెళ్తున్నారని...

Ishan Kishan: ఐపీఎల్ లో పరుగుల వరద పారించాడు.. జాతీయ జట్టులో తేలిపోతున్నాడు.. ఇలా అయితే కష్టమే..

Ishan Kishan: అప్పట్లో దూకుడుగా బ్యాటింగ్ చేసేవాడు. వన్డేలో అతడికి డబుల్ సెంచరీ కూడా ఉంది. ఈ స్థాయిలో ఆడిన అతడు స్థిరత్వాన్ని కొనసాగించలేకపోయాడు. దీనికి తోడు క్రమశిక్షణలోపించడంతో జట్టులో స్థానం...

Vijayendra Prasad: రాజమౌళి కి నచ్చినట్టుగా కథ రాయడం చాలా కష్టం అంటున్న విజయేంద్రప్రసాద్… ఆయన అడిగేవి ఇవే…

Vijayendra Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన రాజమౌళి ఆ తర్వాత పాన్ ఇండియా పరిధిని టచ్ చేస్తూ ప్రేక్షకులోకాన్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని...
Oktelugu Epaper
Exit mobile version