Heroine Heera : ఈమె తెలుగుతోపాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో సుమారు 50 కి పైగా సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ముఖ్యంగా హీరా తెలుగులో అక్కినేని నాగార్జున హీరోగా నటించిన ఆవిడ మా ఆవిడే సినిమాలో సెకండ్ హీరోయిన్గా నటించి తెలుగులో బాగా గుర్తింపు తెచ్చుకుంది. ఒకప్పుడు ఈ బ్యూటీ తన గ్లామర్ తో ఇండస్ట్రీని ఒక ఊపు ఊపింది. ప్రస్తుతం ఈమె లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. దీనికి ముఖ్య కారణం హీరా ఒక స్టార్ నటుడిని ఉద్దేశిస్తూ చేసిన కొన్ని కామెంట్స్. అప్పట్లో హిర ఆ స్టార్ నటుడితో ప్రేమాయణం నడిపిస్తున్నట్లు కొన్ని వార్తలు కూడా వినిపించాయి. వీళ్ళిద్దరూ పెళ్లి కూడా చేసుకుంటారని రూమర్లు బాగా వినిపించాయి.
కానీ అప్పట్లో కొన్ని కారణాల వలన వీరిద్దరి ప్రేమకు ఫుల్ స్టాప్ కూడా పడినట్లు సమాచారం. హీరా చెన్నైకి చెందిన అమ్మాయి. ఈమె పబ్లిక్ రౌడీ అనే సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు హీరోయిన్గా పరిచయం అయింది. ఆ తర్వాత హీరా తెలుగులో దొంగల రాజ్యం, లిటిల్ సోల్జర్స్, శ్రీకారం, ఆహ్వానం, అంతపురం, చెలికాడు, పెద్దమనుషులు, అల్లుడుగారు వచ్చారు వంటి పలు తెలుగు సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. ముఖ్యంగా ఈమెకు మణిరత్నం దర్శకత్వం వహించిన దొంగ దొంగ సినిమాతో తెలుగులో బాగా గుర్తింపు వచ్చింది. తెలుగుతోపాటు ఈ చిన్నది ఇతర భాషలలో కూడా 50 కి పైగా సినిమాలలో నటించి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. కానీ సినిమా ఇండస్ట్రీలో ఆమెకు క్రమంగా అవకాశాలు తగ్గిపోవడంతో ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. హీరా చివరిగా 1999లో రిలీజ్ అయిన స్వయంవరం సినిమాలో నటించింది. ఆ తర్వాత ఈమె మరొక తెలుగు సినిమాలో కనిపించలేదు.
హీరా పుష్కర్ మాధవ్ ను 2002లో పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఈ జంట కొన్ని కారణాల వలన 2006లో విడాకులు తీసుకొని విడిపోయారు. ప్రస్తుతం హీరా ఒంటరిగా అమెరికాలో జీవనం సాగిస్తున్నట్లు సమాచారం. రీసెంట్గా రాజగోపాల్ తన బ్లాగులో చేసిన కొన్ని కామెంట్స్ ప్రస్తుతం చర్చనీయాంసం గా మారాయి. నాకు ఒక నటుడు ద్రోహం చేయడమే కాకుండా తన ఫ్యాన్స్ తో నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలాగా చేశాడు. నేను అతని వల్ల చాలా అవమానాలు అలాగే చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఒకసారి అతను వెన్నుముకకు దెబ్బ తగిలి శస్త్ర చికిత్స చేయించుకున్నానని నాతో చెప్పాడు. ఆ సమయంలో నేను అతనితోనే ఉండి ఎన్నో సేవలు చేశాను. కానీ ఆ తర్వాత అతను తన ఆరోగ్యం విషయంలో కూడా నాతో అబద్ధం చెప్పినట్లు తెలుసుకున్నాను అని హీరా రాసుకుంది. ప్రస్తుతం ఈ కామెంట్స్ సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి.
