కన్నడ స్టార్ హీరోగా మంచి ఫామ్ లో ఉన్న సమయంలో హీరో చిరంజీవి సర్జా సడెన్ గా మృతి చెంది, ఆయన భార్య, నటి మెఘనా రాజ్ తో పాటు తన అభిమానులకు తీరని బాధను మిగిల్చి వెళ్లిపోయారు. అయితే, చిరంజీవి సర్జా చనిపోయి నేటికి ఏడాది అవుతుంది. గతేడాది ఇదే రోజున జూన్ 7వ తేదీన చిరు సర్జా గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.
కాగా ఆయన మొదటి వర్థంతి సందర్భంగా ఆయన భార్య, నటి మెఘనా రాజ్ ఒక ఎమోషనల్ మెసేజ్ తో పాటు ఒక ఫోటో కూడా పోస్ట్ చేశారు. మేఘన మాట్లాడుకుంటుండగా చిరంజీవి ప్రేమగా ఆమె వైపు చూస్తున్న ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. దీనికి మోఘన ఎమోషనల్ క్యాప్షన్ తో హార్ట్ ఎమోజీని జోడించి నెటిజన్లను కదిలించారు.
ఈ పోస్ట్ పై ప్రముఖ నటి, మెఘనా సన్నిహితురాలు నజ్రీయా నజీంతో పాటు పలువురు సినీ ప్రముఖులు అలాగే నెటిజన్లు కూడా స్పందిస్తూ ఎమోషనల్ మెసేజ్ లు పోస్ట్ చేశారు. ఇక చిరంజీవి సర్జా మృతి చెందే సమయానికి మేఘన అయిదు నెలల గర్భవతి. గతేడాది అక్టోబర్‌లో ఆమె జూనియర్ చిరంజీవి సర్జాకి జన్మించారు. బాబు అచ్చం తన తండ్రిలానే ఉన్నారంటూ మేఘన రాజ్ సోషల్ మీడియాలో ఎప్పుడు పోస్ట్ లు పెడుతూ ఉంటారు.
జూనియర్ చిరంజీవి సర్జాకి సంబంధించిన ప్రతి ఫంక్షన్ కి సంబంధించిన వీడియోలను, ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో మేఘన రాజ్ పోస్ట్ చేస్తూ తన భర్త లేని బాధను తన కొడుకు రాకతో తీర్చుకుంటూ ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు.