Dimple Hayathi: గద్దల కొండ గణేష్ సినిమా ద్వారా “సూపర్ హిట్” అనే పాటతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైంది డింపుల్ హయాతి. విజయవాడలో పుట్టిన ఈ అమ్మడు అనేక అందాల పోటీలలో పాల్గొంది. చిన్న చిన్న వేషాలతో ఆకట్టుకుంది. గద్దల కొండ గణేష్ సినిమాలు సూపర్ హిట్ పాట తర్వాత ఆమెకు అవకాశాలు వచ్చాయి. రవితేజ హీరోగా నటించిన కిలాడి సినిమాలో ఓ హీరోయిన్ గా కనిపించింది డింపుల్ హయాతి. ఆ తర్వాత గోపీచంద్ హీరోగా వచ్చిన రామబాణం సినిమాలో కూడా హీరోయిన్ గా నటించింది.
అప్పుడప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు.. వివాదాస్పద చేష్టల ద్వారా డింపుల్ హయాతి వార్తల్లో ఉంటుంది. ఆ మధ్య ఆమె మీద ఒక కేసు కూడా నమోదయింది. అదే సమయంలో ఆమె మరొక వ్యక్తితో లివింగ్ రిలేషన్ లో ఉన్న విషయం బయటపడింది. ఇక ఇప్పుడు హైదరాబాదులోని ఓ ఖరీదైన ప్రాంతంలో ఒక వ్యక్తితో కలిసి డింపుల్ నివాసం ఉంటోంది. అతడు లాయర్ అని తెలుస్తోంది. ఆ ఖరీదైన ప్రాంతంలో ఉండే డింపుల్ తన కుక్కలను చూసుకోవడానికి పని మనుషులను నియమించుకుంది. ఆ పని మనుషులు ఒరిస్సా నుంచి వచ్చారు. కుక్కలను చూసుకున్నారు. వారితో పని చేయించుకున్న టెంపుల్ జీతం ఇవ్వకుండా బయటికి వెళ్లగొట్టింది. అంతేకాదు తన భర్తతో కూడా తిట్టించింది.. ఈ విషయాలను ఓ మహిళ వెల్లడించింది..”కుక్కలను చూసుకోవడానికి మనుషులు కావాలంటే ఒడిశా నుంచి ఇద్దరిని రప్పించాను. వారిద్దరు కూడా కుక్కలను బాగానే చూసుకున్నారు. కానీ వారికి వేతనం ఇవ్వకుండా డింపుల్ హయాతి, ఆమె భర్త వేధిస్తున్నారు. చివరికి వారిద్దరిని బయటకి పంపించారు. జీతం గురించి అడిగితే తను కలిసి ఉండే వ్యక్తితో డింపుల్ హయాతి తిట్టించింది. కేసు పెడతానని బెదిరించిందని” ఆ మహిళ వీడియోలో పేర్కొంది.
” మీరు నా చెప్పుల అంత విలువ కూడా చేయరు. నువ్వెంత.. నీ బతుకంతా అని డింపుల్ హయాతి భర్త రెచ్చిపోయాడు. జీతం కూడా ఇవ్వకుండా ఇద్దరు యువతులను ఇంట్లో నుంచి వెళ్లగొట్టాడు. నేను లాయర్ ను. నన్ను ఏమి పీకలేరు. నేను మిమ్మల్ని ఏమైనా చేయగలను. జీతం గురించి నన్ను అడిగితే మాత్రం బాగోదు అంటూ” అతడు మా మీద రెచ్చిపోయాడని ఆ మహిళ వాపోయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో పడి రచ్చ రచ్చ అయింది. అయితే దీనిపై డింపుల్ హయాతి ఇంతవరకు ఎటువంటి ప్రకటన చేయలేదు.
మరోసారి వివాదంలో హీరోయిన్ డింపుల్ హయాతి
కుక్కలు చూసుకోడానికి పని మనుషులు కావాలని పిలిపించి.. ఒరిస్సా నుంచి వచ్చిన యువతులను వేధించిన డింపుల్ హయాతి, ఆమె భర్త
పని చేయించుకొని డబ్బులు ఇవ్వకుండా తన భర్తతో తిట్టించింది అంటూ ఆరోపించిన మహిళ
మీరు నా చెప్పులు అంత వాల్యూ చేయరు.. నువ్వు… https://t.co/PfeNndxVn2 pic.twitter.com/lqUtEDZPBO
— Telugu Scribe (@TeluguScribe) September 30, 2025