Kothagudem: ఫ్రీ బస్సు పథకం పెట్టిన దగ్గర నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఒకచోట గొడవ జరుగుతూనే ఉంది. సీట్లు దొరకడం లేదని.. ఆపినచోట బస్సు నిలపడం లేదని.. సమయానికి బస్సులు రావడంలేదని.. ఇలా రకరకాల కారణాలతో వివిధ ఒకచోట రచ్చ జరుగుతూనే ఉంది. ఫ్రీ బస్సు కావడం.. మహిళలకు ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం ఉండడంతో.. గొడవలు తారస్థాయిలో జరుగుతున్నాయి. సహజంగా మహిళల్లో పట్టుదల ఎక్కువగా ఉంటుంది కాబట్టి గొడవను ఏమాత్రం తగ్గించరు. పైగా దుందుడుకుగా మీదికి మీదికి వెళ్తుంటారు. అయితే ఇప్పుడు మీరు చదవబోయే కథనంలో ఓ మహిళ ఆర్టీసీ బస్సును ఆపింది. ఆమె ఆపింది సీటు కోసం కాదు.. ఇతర ప్రాంతానికి వెళ్లడానికి కాదు.. మరి దేనికంటే..
అది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. చుంచుపల్లి ప్రాంతంలో ఆర్టీసీ బస్సు ఆగింది. ఆ బస్సులో ఓ మహిళ ఎక్కింది. ఆ బస్సు ఖమ్మం వెళ్తోంది.. పైగా అది డీలక్స్ బస్సు.. తనకు ఆధార్ కార్డు ఉందని.. ఖమ్మం వెళ్లడానికి ఉచితంగా టికెట్ ఇవ్వాలని కండక్టర్ ను కోరింది. దానికి కండక్టర్ ఒప్పుకోలేదు. పైగా కండక్టర్ తో ఆమె వాగ్వాదానికి దిగింది. అంతేకాదు అదే ఆగ్రహంతో బస్సు ముందుకు వచ్చి కదలకుండా కూర్చుంది. స్థానికులు ఆమెను లేపడానికి ప్రయత్నించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. అంతేకాదు బస్సు కిందికి దూరి.. కదలకుండా ఆపింది. పోలీసులు సమాచారం అందుకొని.. ఆమెను అతి కష్టం మీద పక్కకు జరిపారు.
అయితే ఆ మహిళ విపరీతంగా మద్యం తాగి ఉందని.. ఆ తాగిన మైకంలో అలా చేసి ఉంటుందని స్థానికులు అంటున్నారు. పైగా పోలీసులను డబ్బులు అడిగింది. ఊరు వెళ్తానని.. అందుకోసమే తనకు డబ్బులు ఇవ్వాలని వారిని డిమాండ్ చేసింది. లేడీ కానిస్టేబుళ్లు రావడంతో.. ఆమెను అక్కడి నుంచి పక్కకు జరిపారు. ఈ దృశ్యాలను మొత్తం కొంతమంది వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంతకాలం మద్యం తాగి మందుబాబులు రచ్చ రచ్చ చేశారు.ఇప్పుడు ఆ జాబితాలోకి మహిళలు కూడా చేరారని స్థానికులు చర్చించుకుంటున్నారు.
డీలక్స్ బస్సులో ఉచిత టికెట్ ఇవ్వాలి
కొత్తగూడెంలో మహిళా ప్రయాణికురాల హల్చల్
మణుగూరు నుండి ఖమ్మం వెళ్తున్న బస్సు లో గొడవకు దిగువ మహిళా ప్రయాణికురాలు
డీలక్స్ బస్సు లో ఉచిత టికెట్ ఇవ్వమని కండక్టర్‌తో వాగ్వివాదం
బస్సు కిందకి వెళ్లే ప్రయత్నం చేసిన ప్రయాణికురాలు
మహిళకు… pic.twitter.com/VEq6N2KTKa
— Telugu Feed (@Telugufeedsite) September 30, 2025