https://oktelugu.com/

డ్రగ్స్ తో పట్టుబడ్డ హీరోయిన్… రంగంలోకి టాలీవుడ్ పెద్దలు!

టాలీవుడ్ లో డ్రగ్స్ కేసు కలకలం రేపుతోంది. ఓ టాలీవుడ్ హీరోయిన్ డ్రగ్స్ తో పట్టుబడ్డారన్న వార్త నిన్నటి నుండి సంచలనంగా మారింది. మరో వ్యక్తితో పాటు నిషేధిత ఉత్ప్రేరకాలతో హీరోయిన్ పట్టుబడినట్లు తెలుస్తుంది. బాలీవుడ్ లో ఇంకా డ్రగ్స్ కేసు సద్దుమణగని నేపథ్యంలో టాలీవుడ్ హీరోయిన్ డ్రగ్స్ కేసులో దొరకడం ఆసక్తికరంగా మారింది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసుతో మొదలైన విచారణ డ్రగ్స్ కోణం తీసుకున్న సంగతి తెలిసిందే. సుశాంత్ మాజీ ప్రేయసి […]

Written By:
  • Neelambaram
  • , Updated On : January 4, 2021 / 11:59 AM IST
    Follow us on


    టాలీవుడ్ లో డ్రగ్స్ కేసు కలకలం రేపుతోంది. ఓ టాలీవుడ్ హీరోయిన్ డ్రగ్స్ తో పట్టుబడ్డారన్న వార్త నిన్నటి నుండి సంచలనంగా మారింది. మరో వ్యక్తితో పాటు నిషేధిత ఉత్ప్రేరకాలతో హీరోయిన్ పట్టుబడినట్లు తెలుస్తుంది. బాలీవుడ్ లో ఇంకా డ్రగ్స్ కేసు సద్దుమణగని నేపథ్యంలో టాలీవుడ్ హీరోయిన్ డ్రగ్స్ కేసులో దొరకడం ఆసక్తికరంగా మారింది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసుతో మొదలైన విచారణ డ్రగ్స్ కోణం తీసుకున్న సంగతి తెలిసిందే. సుశాంత్ మాజీ ప్రేయసి రియా చక్రవర్తితో పాటు ఆమె తమ్ముడు షోవిక్ చక్రవర్తిని డ్రగ్స్ ఆరోపణలపై అరెస్ట్ చేయడం జరిగింది. కొందరు డ్రగ్ పెడ్లర్స్ తో వీరికి ప్రత్యక్ష సంబంధాలు ఉన్నట్లు ఆధారాలు లభించడంతో అరెస్ట్ చేశారు. అనంతరం వీరిద్దరూ బెయిల్ పై విడుదల కావడం జరిగింది.

    Also Read: ‘ఆహా’.. ఏమైనా ఆఫరా

    అలాగే బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ దీపికా పదుకొనె, రకుల్ ప్రీత్, సారా అలీ ఖాన్ లతో పాటు శ్రద్దా కపూర్ డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొన్నారు. వీరిని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు విచారించడం అప్పట్లో సంచలనం రేపింది. ఇటీవల బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ కూడా విచారణకు హాజరుకావాలని సమన్లు జారీ చేయగా, అతను విచారణలో పాల్గొన్నారు. మరో వైపు కన్నడ పరిశ్రమలో డ్రగ్స్ ఆరోపణలపై హీరోయిన్స్ సంజనా గల్రాని, సాక్షి ద్వివేది అరెస్ట్ కాబడ్డారు. తాజాగా ఈ డ్రగ్స్ కేసు టాలీవుడ్ కి పాకి అందరినీ షాక్ కి గురిచేసింది.

    Also Read: పెళ్లి అయినా వదట్లేదు.. వరుసగా అవకాశాలు !

    చాంద్ మహమ్మద్ అనే వ్యక్తితో పాటు ఓ టాలీవుడ్ హీరోయిన్ పట్టుబడ్డారు. ముంబైలోని ఓ హోటల్ లో పక్కా సమాచారం ప్రకారం ఎన్ సి బి అధికారులు దాడి చేశారు. డ్రగ్స్ సప్లయర్ సయీద్ అనే వ్యక్తి తప్పించుకుపారిపోగా, హీరోయిన్, చాంద్ మహమ్మద్ దొరికిపోయారట. వీరి దగ్గర 400 గ్రాముల ఎం డి అనే మాదక ద్రవ్యం పట్టుబడగా… దాని విలువ రూ. 10లక్షల వరకూ ఉంటుందని సమాచారం. ఇక ఆ హీరోయిన్ ఎవరనే సమాచారం బయటపెట్టడం లేదు. బి-గ్రేడ్, సి-గ్రేడ్ సినిమాలలో ఆమె హీరోయిన్ గా నటించారట. ఇప్పటి వరకు సదరు హీరోయిన్ కేవలం నటించింది నాలుగు సినిమాలేనని సమాచారం. టాలీవుడ్ పరువు పోకుండా టాలీవుడ్ పెద్దలు రంగంలోకి దిగినట్లు వినికిడి. సదరు హీరోయిన్ పేరు భయటపెట్టకపోవడానికి కారణం కూడా టాలీవుడ్ పెద్దలే అని సమాచారం.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్