https://oktelugu.com/

‘బాలయ్య’ హీరోయిన్ ఆడిషన్స్.. ఇది పెద్ద బాధే !

మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ప్రస్తుతం హీరోయిన్ కోసం ఆడిషన్స్ తీసుకుంటున్నాడు. ఆయన దర్శకత్వంలో నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా రానున్న సినిమాలో ముందుగా ఓ కొత్త హీరోయిన్ ను తీసుకుని ఆమెకు కొన్ని వర్క్ షాప్స్ కూడా నిర్వహించారు. కానీ, బాలయ్య పక్కన ఆ హీరోయిన్ సరిగ్గా యాక్ట్ చేయలేకపోతుందట. అందుకే ఆమెను సినిమా నుండి తప్పించి.. మరో హీరోయిన్ కోసం బోయపాటి జూమ్ యాప్ ద్వారా ముంబాయి భామల నుండి కొన్ని ఆడిషన్స్ […]

Written By:
  • admin
  • , Updated On : September 15, 2020 / 10:56 AM IST
    Follow us on


    మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ప్రస్తుతం హీరోయిన్ కోసం ఆడిషన్స్ తీసుకుంటున్నాడు. ఆయన దర్శకత్వంలో నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా రానున్న సినిమాలో ముందుగా ఓ కొత్త హీరోయిన్ ను తీసుకుని ఆమెకు కొన్ని వర్క్ షాప్స్ కూడా నిర్వహించారు. కానీ, బాలయ్య పక్కన ఆ హీరోయిన్ సరిగ్గా యాక్ట్ చేయలేకపోతుందట. అందుకే ఆమెను సినిమా నుండి తప్పించి.. మరో హీరోయిన్ కోసం బోయపాటి జూమ్ యాప్ ద్వారా ముంబాయి భామల నుండి కొన్ని ఆడిషన్స్ తీసుకుంటున్నాడు. వారిలో నలుగురిని ఫైనల్ చేశారని.. కాకపోతే వాళ్లల్లో ముగ్గురు యంగ్ కావడంతో.. బోయపాటికి మరో అప్షన్ లేకుండా పోయింది. ఆ రకంగా ఇప్పుడు బాలయ్యకు హీరోయిన్ సమస్య మళ్లీ మొదటికి వచ్చింది.

    Also Read: మెగా బ్రదర్ నాగబాబుకు కరోనా సోకిందా?

    ఇక లాభం లేదనుకున్నా బోయపాటి, ఆడిషన్స్ ను కొనసాగించనున్నాడు. కేరళ బ్యూటీలను కూడా కొంతమందిని ఆడిషన్స్ చేయనున్నాడు. నిజానికి పెద్ద హీరోయిన్స్ చాలామందినే ఉన్నారు. కానీ, వారికి భారీ మొత్తంలో రెమ్యునరేషన్ ఇచ్చే పరిస్థితి లేదు. బాలయ్య సినిమాలకు కలెక్షన్స్ రావడం ఎప్పుడో ఆగిపోయింది. పైగా బాలయ్య సినిమాలు పూర్తిగా డిజాస్టర్ లు అవుతున్నాయి. పది కోట్లు కూడా కలెక్ట్ చేయలేని బాలయ్య కోసం, కోటి రెండు కోట్లు పెట్టి హీరోయిన్ ను తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని నిర్మాత బోయపాటిని అడుగుతున్నాడట. బాలయ్యకు ఇవ్వన్నీ డైరెక్ట్ గా బోయపాటి చెప్పలేడు, అలా అని నిర్మాతను రిస్క్ చేయమని చెప్పే పరిస్థితిలో బోయపాటి లేడు. మొత్తానికి ఇటు బాలయ్యకి అటు నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి మధ్య బోయపాటి నలిగిపోతున్నాడు.

    Also Read: హీరో కావాల్సిన లోకేష్ పొలిటీషన్ ఎలా అయ్యాడు?

    ఏది ఏమైనా బాలయ్యతో ఆ మధ్య ఓ సినిమా చేసి.. ఆ సినిమా భారీ డిజాస్టర్ అయి, తన డబ్బులు మొత్తం పోగొట్టుకున్న ఓ నిర్మాత, మిర్యాల రవీందర్ రెడ్డికి పర్సనల్ గా ఫోన్ చేసి.. ఎక్కువ బడ్జెట్ పెట్టి తనలా మొత్తం పోగొట్టుకోవద్దు అని రిక్వెస్ట్ చేస్తున్నాడట. నిజంగా ఇది బాలయ్యకు ఎంత అవమానం. బాలయ్యకి ఎప్పుడూ కలెక్షన్స్ విషయంలోనే అవమానం అనుకుంటే.. ఇప్పుడు సినిమా బడ్జెట్ విషయంలోనూ అవమానం జరుగుతుంది. అయినా, ఫుల్ ఫామ్ లో ఉన్న నయనతార లాంటి హీరోయిన్ ను తీసుకోలేకపోయినా, ఆల్ రెడీ ఫేమ్ ఉన్న హీరయిన్ అంజలి లాంటి వారిని తీసుకోవచ్చు కదా. నలభై లక్షల్లో అంజలి లాంటి హీరోయిన్ లు సినిమా చేయడానికి రెడీగా ఉంటారు. అంటే.. బాలయ్య హీరోయిన్ కోసం నలభై లక్షలు కూడా ఖర్చు పెట్టడానికి మేకర్స్ రెడీగా లేరు అనుకోవాలేమో. ఇది నిజంగా బాలయ్య అభిమానులకు పెద్ద బాధే.