Heroine Anitha: సినిమాకు హీరోయిన్లు గ్లామర్ తెప్పిస్తారు. కొన్ని సినిమాలు అందమైన హీరోయిన్లతోనే హిట్టు కొడుతూ ఉంటాయి. వీరిని చూసేందుకు యూత్ థియేటర్లకు తరలివస్తుంటారు. మరికొందరు మాత్రం ఎలాంటి హద్దులు దాటకుంటా సాంప్రదాయంగా నటిస్తారు. తమ మొహబావాలతో అలరిస్తారు. అలా నటించి గుర్తింపు తెచ్చుకున్న వారిలో అనిత ఒకరు. తెలుగులో ‘నువ్వు నేను’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ తరువాత చాలా సినిమాల్లో నటించినా పెద్దగా గ్లామర్ షో చేయలేదు. కానీ చాలా రోజుల తరువాత అందాల పరువాలను షో చేస్తోంది. సాంప్రదాయ కట్టుబాట్లను తెంచేసి బికినీ డ్రెస్ లో కనిపించింది.
మహారాష్ట్రలోని ముంబైకి చెందిన అనిత 1981 ఏప్రిల్ 14న జన్మించింది. చదువు పూర్తి చేసుకున్న తరువాత సినిమాల కోసం ఎదురుచూస్తున్న తరుణంలో తెలుగు డైరెక్టర్ తేజ కు అనిత కనిపించి అలరించింది. దీంతో వెంటనే తాను తీసే ‘నువ్వు నేను’ కోసం సెలెక్ట్ చేశారు.ఇందులో ఉదయ్ కిరణ్ తో కలిసి నటించింది. ఈ సినిమాలోని కొన్ని సీన్లలో అనిత కు యాక్టింగ్ రాలేదు. రైల్వేస్టేషన్ లో ఏడుపు సీన్ కోసం అనితపై డైరెక్టర్ తేజ చేయి వేసుకున్నాడన్న ప్రచారం జరిగింది. ఆలా పస్ట్ మూవీలో ఎన్నో కష్టాలు పడ్డ అనిత ఆ తరువాత స్టార్ ఇమేజ్ దక్కించుకుంది.
‘నువ్వునేను’ సక్సెస్ కావడంతో అనితకు అవకాశాలు వచ్చాయి. ఆ తరువాత మరోసారి ఉదయ్ కిరణ్ తో కలిసి ‘శ్రీరామ్’లో నటించింది. ఆ తరువాత తరుణ్ తో ‘నిన్నే ఇష్టపడ్డాను’ సినిమాలో మెరిసింది. ఈ మూడు సినిమాలు సక్సెస్ కావడంతో అనిత స్టార్ అయిపోయింది. కానీ ఆ తరువాత అను అనుకున్న అవకాశాలు రాలేదు. అడపాదడపా కొన్ని సినిమాల్లో కనిపించినప్పటికీ అవి పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో బాలీవుడ్ వెళ్లిన ఆమె ‘కళావర్ కింగ్ ’నే హిందీ సినిమాలో నటించింది.
సినీ ఇండస్ట్రీలో తారల మధ్య పోటీ ఏర్పడడంతో అనితకు అవకాశాలు దక్కలేదు. దీంతో ఆమెు 2013 అక్టోబర్ 14న వ్యాపారవేత్త రోహిత్ రెడ్డిని పెళ్లి చేసుకుంది. సినిమాల్లో కనిపించలేదు గానీ.. ఎవర్ యూత్, బోరో ప్లస్, సన్ సిల్క్ వంటి ఉత్పత్తులకు ప్రచార కర్తగా మారింది. అయితే అనిత తాజాగా బికినీ షో చేసింది. చాలా గ్యాప్ ఇచ్చిన తరువాత ఏకంగా బికినీ షో చేయడంపై ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఒకప్పుడు సినిమాల్లో సాంప్రదాయంగా కనిపించిన అనిత ఒక్కసారిగా అందాలన్నీ ఆరబోయడంపై తీవ్ర చర్చ సాగుతోంది. అఅంతేకాకుండా మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికే ఈ మార్పులా? అని కొందరు కామెంట్ పెడుతున్నారు.
View this post on Instagram