India Vs Australia Odi: ఈ రోజు ఇండియా ఆస్ట్రేలియా మధ్య జరిగే మ్యాచ్ లో ఏ టీం విజయం సాధిస్తుంది. అనేది చాలా ఉత్కంఠ ను కలిగిస్తుంది.అయితే ఇవాళ మొహాలీ లో మ్యాచ్ ఆడుతుండటం వాళ్ళ ఆ పిచ్ రిపోర్ట్ ఏంటి మన ప్లేయర్లు ఎవరు ఎలాంటి ఫామ్ లో ఉన్నారు అలాగే ఆస్ట్రేలియన్ ప్లేయర్లలో ఎవరిని కట్టడి చేస్తే మ్యాచ్ మన వైపు కి తిరుగుతుంది అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.
అయితే ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా టీం ఫుల్ స్క్వాడ్ తో బరిలోకి దిగుతుంది.వాళ్ళ టీం లో టాప్ బ్యాట్స్ మెన్స్ టాప్ బౌలర్లు అందరు కూడా ఈ మ్యాచ్ లో అందుబాటు ఉంటున్నారు.ఇక వీళ్ల బ్యాటింగ్ లో ముఖ్యం గా వార్నర్, స్మిత్ ,స్టోయినిస్, మక్సవెల్,అలెక్స్ క్యారీ లాంటి బ్యాట్స్ మెన్స్ అందరు కూడా ఈ టీం లో ఉండటం అలాగే వాళ్ళు మంచి ఫామ్ లో ఉండటం కూడా ఆస్ట్రేలియా టీం కి చాలా వరకు కలిసి వచ్చే అంశం. ఇక ముఖ్యంగా స్మిత్ అయితే ఇండియా మీద చాలా మంచి బ్యాటింగ్ చేస్తాడు ఆయనకి ఇప్పటికే ఇండియా మీద మంచి రికార్డులు కూడా ఉన్నాయి.ఇక బౌలర్లు అయినా స్టార్క్ ,కమ్మిన్స్ ,జోస్ హాజిల్ వుడ్ లాంటి బౌలర్లు కూడా ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉండటం మనం గత మ్యాచుల్లో చూసాం…అయితే ముఖ్యంగా మన బౌలర్లు స్మిత్ , మక్సవెల్ , స్టొయినిస్ ని కనక కట్టడి చేసినట్టు అయితే మనం ఈ మ్యాచ్ గెలవచ్చు…
ఇక ఇండియా టీం విషయానికి వస్తే ఇండియా టీం కంప్లిట్ గా ఈ మ్యాచ్ లో యంగ్ ప్లేయర్లతో బరిలోకి దిగుతుంది. కాబట్టి ఈ మ్యాచ్ లో గెలుస్తుందా, లేదా అనేది పక్కన పెడితే ఒకసారి మనం మన ప్లేయర్ల గురించి చూసుకుందాం…ఈ మ్యాచ్ లో ఇషాన్ కిషన్,శుభమాన్ గిల్,శ్రేయాస్ అయ్యర్,తిలక్ వర్మ సూర్య కుమార్ యాదవ్, కె ఎల్ రాహుల్ లాంటి ప్లేయర్లు టీం లో ఉంటారు కాబట్టి వీళ్లు ఎలా ఆడుతున్నారు అనేది తెలిస్తే దాన్ని బట్టి తర్వాత వీళ్ల మీద ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అనేదాని కోసం వీళ్ళని ఈ మ్యాచ్ ఆడిస్తున్న మాట వాస్తవం… అయినప్పటికీ ఈ పిచ్ లో మనవాళ్ళకి గెలిచే అవకాశం చాలా ఎక్కువ గానే ఉంది…గిల్ కనక ఈ మ్యాచ్ లో ఒక భారీ ఇన్నింగ్స్ ఆడితే సరిపోతుంది ఇక ఓపెనర్ గా వచ్చే మరో ప్లేయర్ అయిన ఇషాన్ కిషన్ కూడా తన స్థాయి పెర్ఫామెన్స్ ఇస్తే ఈజీ గా ఈ మ్యాచ్ మన చేతుల్లోకి వస్తుంది…
ఇక ఒకసారి ఈ రెండు టీం లు హెడ్ టు హెడ్ ఈ గ్రౌండు లో తల పడిన మ్యాచులను కనక చూసుకుంటే..ఇండియా ఆస్ట్రేలియా ఐదు సార్లు తలపడితే అందులో నాలుగు సార్లు ఆస్ట్రేలియా గెలిచింది,ఒక్కసారి మాత్రమే ఇండియా గెలిచింది..ఇక 1996 తర్వాత నుంచి అయితే ఇంతవరకు ఒక్క మ్యాచ్ కూడా ఇండియా గెలవలేకపోయింది.అయితే ఈ గ్రౌండ్ లో ఇండియా ఇప్పటి వరకు మొత్తం 16 మ్యాచులు ఆడితే అందులో పది మ్యాచులు గెలిచి, ఆరు మ్యాచులో ఓడిపోయింది.ఈ గ్రౌండ్ లో ఇండియా కి మంచి రికార్డు అయితే ఉంది కానీ ఆస్ట్రేలియా మీద మాత్రం ఈ గ్రౌండ్ లో అంత మంచి రికార్డు లేదు మన ఇండియా ఓడిపోయినా ఆరు మ్యాచుల్లో నాలుగు మ్యాచ్ లు ఆస్ట్రేలియా మీద ఓడిపోయినవే ఉన్నాయి…
ఇది బ్యాటింగ్ కి ఫాస్ట్ బౌలింగ్ కి ఎక్కువ గా అనుకూలించే పిచ్ అందుకే ఇక్కడ జరిగిన లాస్ట్ ఐదు మ్యాచుల్లో కూడా 300 ప్లస్ స్కోర్స్ వచ్చాయి.ఇక ఇప్పటి వరకు ఈ గ్రౌండ్ లో 25 మ్యాచులు ఆడితే అందులో మొదట బ్యాటింగ్ చేసిన టీములు 15 మ్యాచుల్లో గెలిస్తే, ఛేజింగ్ చేసిన టీములు 10 మ్యాచుల్లో గెలిచాయి.ఇక మొదట బ్యాటింగ్ చేసిన టీం యావరేజ్ స్కోర్ వచ్చేసి 272 పరుగులు గా ఉంది.
ఇక ఇదే గ్రౌండ్ 2019 లో ఆస్ట్రేలియా మీద ఇండియా మొదటి బ్యాటింగ్ తీసుకొని 359 పరుగులు చేస్తే ఆస్ట్రేలియా ఆ మ్యాచ్ లో ఛేజ్ చేసి మరి విజయం సాధించింది…ఈ గ్రౌండ్ మనకు హోమ్ గ్రౌండ్ అయినా కూడా మనకంటే ఆస్ట్రేలియా టీం కె ఈ పిచ్ ఎక్కువ ఫెవర్ గా ఉంది. అయినప్పటికీ మనవాళ్ళు ఏషియా కప్ గెలిచి మంచి జోష్ లో ఉన్నారు. అలాగే ఆస్ట్రేలియా టీం విషయానికి వస్తే రీసెంట్ గా సౌత్ ఆఫ్రికా టీం మీద ఆడిన వన్డే సిరీస్ ని ఓడిపోయారు కాబట్టి వాళ్ళు కొంత వరకు డల్ అయిపోయి ఉన్నారు.ఇక ఎలాగైనా ఈ మ్యాచ్ లో మన ప్లేయర్లు విజయం సాధించాలని కోరుకుందాం…