spot_img
Homeఎంటర్టైన్మెంట్Sai Pallavi: హీరోయిన్​గా సాయిపల్లవి చెల్లెలు ఎంట్రీ.. ఫస్ట్ లుక్​ కూడా వచ్చేసింది

Sai Pallavi: హీరోయిన్​గా సాయిపల్లవి చెల్లెలు ఎంట్రీ.. ఫస్ట్ లుక్​ కూడా వచ్చేసింది

Sai Pallavi: ప్రస్తుతం వరుస సూపర్​ హిట్​ చిత్రాలతో.. ఫుల్​ ఫామ్​లో దూసుకెళ్లిపోతోంది హీరోయిన్​ సాయి పల్లవి. తన గ్లామర్​, అద్భుతమైన నటనతో ఎంతో మంది ప్రేక్షకాభిమానాన్ని సొంతం చేసుకుంది ఈ మలయాలీ బ్యూటి. ముఖ్యంగా సాయి పల్లవి డాన్స్​ను ఒక్కో సారి హీరోలు కూడా అందుకోవడం కష్టమే.. ఆ రేంజ్​లో డాన్స్ చేస్తుంది సాయిపల్లవి. కాగా, తాజాగా సాయిపల్లవి చెల్లెలు పూజా కన్నన్​ వెండితెరపై మెరిసేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే గతంలో పూజా ఇండస్ట్రీ ఎంట్రీపై అనేక వార్తలు వచ్చాయి. తాజాగా, వాటిని నిజం చేస్తూ.. తన సినిమాకు సంబంధించిన అప్​డేట్​ను సోషల్​మీడియా వేదికగా పంచుకుంది పూజా.

pooja kannan

తమిళ దర్శకుడు సిల్వ తెరకెక్కిస్తోన్న చిత్తారాయి సెవ్వనం అనే కన్నడ సినిమాలో హీరోయిన్​గా నటించింది పూజా. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్​ను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో ప్రముఖ నటుడు సముద్రఖని కీలక పాత్ర పోషించారు.  ఈ సినిమాను థియేటర్లలో కాకుండా.. ఓటీటీలో విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు మేకర్స్​. ప్రముఖ ఓటీటీ ప్లాట్​ఫామ్ జీ5లో డిసెంబరు 3న ఈ సినిమా విడుదల కానుంది. మరి అక్క సాయిపల్లవికి ఉన్న క్రేజ్​ను పూజా కన్నన్​ ఏ మేరకు సాధిస్తుందో తెలియాలి.

ఇటీవలే లవ్​స్టోరీతో మంచి హిట్​ కొట్టిన సాయిపల్లవి.. శ్యామ్​సింగరాయ్​తో మరోసారి పలకరించేందుకు సిద్ధమైంది. ఇందులో విభిన్న పాత్రలో నటిస్తోంది సాయిపల్లవి. దీంతో పాటు విరాట పర్వంలోనూ హీరోయిన్​గా నటించింది. గతేడాదిలోనే ఈ సినిమా షూటింగ్​ పూర్తి కాగా.. కరోనా కారణంగా విడుదల తేదీ వాయిదా పడుతూ వచ్చింది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper