Sai Pallavi: ఫిదా సినిమాతో తెలుగు సినీ ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం దక్కించుకున్న హీరోయిన్ సాయిపల్లవి. ఇటీవలే లవ్‌స్టోరీ చిత్రంతోనూ కుర్రకారు మసను దోచుకుంది ఈ ముద్దుగుమ్మ. మరోవైపు విరాటపర్వం చిత్రంలోనూ ప్రత్యేక పాత్ర పోషిస్తోంది. ఇలా వరుస చిత్రాలతో టాప్‌హీరోయిన్లలో ఒకరిగా స్థానం దక్కించుకుంది. అయితే, ఇటీవలే ఇన్‌స్టా వేదికగా అభిమానులతో ముచ్చటించింది ఈ భామ. ఈ క్రమంలోనే తనకు ఎప్పటినుంచో కామెడీ సినిమాలో నటించాలని కోరికగా ఉందని తన మనసులో మాట చెప్పింది. మంచి కంటెంట్ ఉన్న కథ దొరికితే కచ్చితంగా చేసేందుకు సిద్ధంగా ఉన్నాని స్పష్టం చేసింది. ఇంట్లో ఉన్నప్పుడు, ఖాళీ సమయాల్లో ఏం చేస్తారని మరో నెటిజన్ అడగగా.. బాగా తిని హాయిగా నిద్రపోతానని తెలిపింది.
మరోవైపుపు ఇటీవలే చూసిన సినిమాల్లో ’డ్యూన్'(హాలీవుడ్), ‘సర్దార్ ఉద్ధమ్’(హిందీ) నచ్చాయని చెప్పింది సాయిపల్లవి. అంతేకాక, ప్రకృతితో కలిసి జీవించడం తనకెంతో ఇష్టమని చెప్పింది. కాగా, రానా ప్రధానపాత్రలో వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం విరాట పర్వం. తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యంలో ఈ సినిమా తీస్తున్నారు. ఇందులో సాయిపల్లవి కీలక పాత్ర పోషిస్తోంది. మరోవైపు నాని హీరోగా వస్తున్న శ్యామ్ సింగ్రాయ్ సినిమాలోనూ హీరోయిన్గా కనిపించనుంది.
సాయి పల్లవి సినిమాలో ఉందంటే ఆమె అందంతో పాటు నటన, డాన్స్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తుంటారు. వయ్యారాలు ఒలికే అందాలతో ఒంపులు తిరిగే శరీరాకృతితో కుర్రాళ్ల మతి పోగొడుతుంది ఈ ముద్దుగుమ్మ. మరి వచ్చే సినిమాల్లో ప్రేక్షకులను ఎలాంటి పాత్రల్లో అలరించనుందో తెలియాలంటే కాస్త వేచి చూడక తప్పదు.