
Mehreen: హీరోయిన్ మెహ్రీన్ ది చాలా పెద్ద మనసు. సగటు హీరోయిన్ కి ఉండాల్సిన లక్షణాలు ఆమెలో ఏ మాత్రం లేవు. నిర్మాతలకు ఎప్పుడు అందుబాటులో ఉంటుంది. నిర్మాతలకు చాలా విషయాల్లో చాలా ఫేవర్ చేస్తూ ఉంటుంది. అందుకే, మెహ్రీన్ ఏవరేజ్ ఫిగర్ అయినా కొంతమంది నిర్మాతలు ఆమెను హీరోయిన్ గా బాగా ప్రమోట్ చేస్తున్నారు. అయితే, మెహ్రీన్ కి ప్రస్తుతం కాలం కలిసి రావడం లేదు.

నిర్మాతలు ఆమెకు అవకాశాలు ఇస్తున్నా.. హీరోలు మాత్రం ఆమెను దూరం పెడుతున్నారు. మెహ్రీన్(Mehreen) తమ సినిమాలో హీరోయిన్ గా హీరోలు అంగీకరించడం లేదు. హీరో రవితేజ కొత్త సినిమాలో మొదట హీరోయిన్ గా మెహ్రీనే. కానీ రవితేజ ఆమెను రిజక్ట్ చేసాడు. ఒక్క రవితేజనే కాదు, శర్వానంద్, నిఖిల్ లాంటి హీరోల సినిమాల నుంచి కూడా ఆమెను తప్పించారు.
ఒక హీరయిన్ గా ఆమెకు మంచి గుర్తింపు ఉంది. పైగా ఆమె సినిమాకి తగట్టు నడుచుకుంటుంది. ఇక ఎక్స్ పోజింగ్ విషయంలో మొహమాట పడదు. అలాగే కాస్త ఓపెన్ మైండ్ తో ఉంటుంది. అందుకే, మెహ్రీన్ లాంటి హీరోయిన్లను ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉందని దిల్ రాజు ఆమెకు ఎఫ్ 3 తో పాటు మరో సినిమా కూడా ఇచ్చాడు.
ప్రస్తుతం మెహ్రీన్ చేతిలో దిల్ రాజు సినిమాలు మాత్రమే ఉన్నాయి. మొన్న వచ్చిన మంచి రోజులొచ్చాయి సినిమాతో ఆ సినిమా మిగిలిన టీమ్ మెంబర్స్ కి మంచి రోజులు వచ్చాయి గానీ, మెహ్రీన్ కి మాత్రం మంచి జరగలేదు. అందుకే ఆమె తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కొంచెం బాధ పడుతూనే.. కొత్తగా తను ఎలాంటి సినిమాలు కమిట్ అవ్వలేదని క్లారిటీ ఇచ్చింది.
త్వరలోనే బాలకృష్ణ-గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో ఓ సినిమా స్టార్ట్ కానుంది. ఈ సినిమాలో మెహ్రీన్ ను సెకండ్ హీరోయిన్ గా తీసుకోవాలని మొదట గోపీచంద్ మలినేని భావించాడు. కానీ, మెహ్రీన్.. బాలయ్య సినిమాలో నటించడానికి ఆసక్తిగా లేదట. బాలయ్య పక్కన నటిస్తే.. ఇక తనకు యంగ్ హీరోలు ఛాన్స్ లు ఇవ్వరు అని ఆమె భయపడుతుంది. మొత్తానికి నిర్మాతల ఫేవరేట్ హీరోయిన్ కి హీరోలందరూ హ్యాండ్ ఇస్తున్నారు.
Also Read: మంచి రోజులొచ్చాయి రివ్యూ