అయితే, నిర్మాత బెల్లంకొండ సురేష్ పెద్ద కుమారుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas) మాత్రం ఇంకా హీరోనే కొనసాగుతున్నాడు. కానీ సాయి శ్రీనివాస్ పరిస్థితి ఏమిటో తెలిసిందే. అన్ని ఉన్నా.. సాయి శ్రీనివాస్ కి హీరో గుర్తింపు లేదు. కొన్ని సినిమాలు ఏవరేజ్ గా ఆడాయి కూడా. అయినా సాయి శ్రీనివాస్ ను మాత్రం ప్రేక్షకులు హీరోగా పరిగణలోకి తీసుకోవడం లేదు.
అసలు హీరో అంటే ఏమిటి ? సినిమా రిలీజ్ రోజు మినిమమ్ కలెక్షన్స్ ను రాబట్టే మార్కెట్ ఉండటం. కానీ, సాయి శ్రీనివాస్ కి ఇంకా ఆ మార్కెట్ రాలేదు. అయినప్పటికీ యాక్షన్ హీరో ఇమేజ్ కోసం ఈ బెల్లంకొండ హీరో బాక్సాఫీస్ వద్ద యుద్ధం చేస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే ‘ఛత్రపతి’ సినిమాని హిందీలోకి రీమేక్ చేస్తున్నాడు.
మరి బాలీవుడ్ ప్రేక్షకులు సాయి శ్రీనివాస్ ను హీరోగా మంచి పొజిషన్ లో నిలబెడతారా ? చూడాలి. అయితే, సాయి శ్రీనివాస్ పరిస్థితి ఇలా ఉంటే.. బెల్లంకొండ సురేష్ రెండో కుమారుడు గణేష్ తన జోరును రోజురోజుకు పెంచుకుంటూ పోతున్నాడు. తాజాగా గణేష్ హీరోగా తన మూడో చిత్రాన్ని మొదలు పెట్టాడు.
అసలు బెల్లంకొండ గణేష్ (Bellamkonda Ganesh) హీరోగా మొదలైన మొదటి రెండు సినిమాలే ఇంకా పూర్తి కాలేదు. ఆ రెండు చిత్రాలు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి. అయినా గణేష్ మాత్రం తన మూడో చిత్రాన్ని లాంచ్ చేశాడు. ‘నాంది’ చిత్రాన్ని నిర్మించిన సతీష్ వేగేశ్న వర్మ ఈ చిత్రానికి నిర్మాత.
రాకేష్ ఉప్పలపాటి అనే కొత్త దర్శకుడు ఈ చిత్రానికి దర్శకుడు. మరి సాయి శ్రీనివాస్ కే మార్కెట్ లేకపోతే, ఇక గణేష్ గురించి చెప్పేది ఏముంది ?.. అంటే ఈ హీరోలు పేరుకే హీరోలు, మార్కెట్ పరంగా జీరోలు.