Vishal Sensational Decision: మన తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(Movie Artist Association) ఎలాంటిదో, తమిళనాడు లో నడిగర్ సంఘం అని ఒకటి ఉంటుంది. మా అసోసియేషన్ కి ప్రెసిడెంట్ గా మంచు విష్ణు(Manchu Vishnu) వ్యవహరిస్తుంటే, నడిగర్ సంఘం(Nadigar Sangham) కి ప్రధాన కార్యదర్శి గా ప్రముఖ హీరో విశాల్(Vishal Reddy) వ్యవహరిస్తున్నాడు. ఇక్కడ మంచు విష్ణు మా ద్వారా ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నాడో మనకు కనిపించడం లేదు కానీ, నడిగర్ సంగం ప్రధాన కార్యదర్శిగా గా విశాల్ తీసుకున్న ఒక సంచలన నిర్ణయం ఇప్పుడు తమిళ సినీ ఇండస్ట్రీ లో సంచలనం గా మారింది. సినిమాకు పైరసీ అనేది ఒక భూతం అయితే, రివ్యూ అనేది మరో భూతం గా మారిపోయింది. విడుదలయ్యే ప్రతీ కొత్త సినిమాకు మొదటి రోజు తెల్లవారుజామున జనాలు నిద్ర లెయ్యగానే రివ్యూస్ చెప్పేస్తున్నారు రివ్యూయర్స్. కొంతమంది అయితే ఒక ఎజెండా గా వాళ్లకు ఇష్టమొచ్చిన రివ్యూ ని రుద్దేస్తున్నారు.
దానివల్ల సినిమా పై తీవ్రమైన ప్రభావం పడుతుంది. పది రోజులు ఆడాల్సిన సినిమా రెండు రోజులు కూడా ఆడడం లేదు. ఓటీటీ లోకి వచ్చిన తర్వాత ఆడియన్స్ ఆ సినిమాలను చూసి, పర్లేదే, బాగానే ఉందిగా?, దీనికి ఎందుకు ఇలాంటి రివ్యూస్ ఇచ్చారు అంటూ ప్రేక్షకులు ఆశ్చర్యపోతూ కామెంట్స్ చేస్తున్నారు. అందుకు ఉదాహరణగా నిల్చిన చిత్రం ‘గుంటూరు కారం’. అలా చాలా సినిమాలే ఉన్నాయి. తమిళం లో కూడా ఇదే పరిస్థితి. అందుకే విశాల్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. రాబోయే రోజుల్లో కొత్త సినిమా విడుదలైన మూడు రోజుల తర్వాతనే థియేటర్స్ ప్రాంగణం లో పబ్లిక్ రివ్యూ లకు మీడియా ని అనుమతించాలని విశాల్ మీడియా ముందు విజ్ఞప్తి చేసాడు. ఒక ఈవెంట్ కి అతిథిగా వచ్చిన ఆయన మీడియా తో మాట్లాడుతూ పై విధంగా స్పందించాడు. అందుకు థియేటర్స్ యాజమాన్యాలు, నిర్మాతలు,పంపిణీదారులు సహకరించాలని ఆయన ఈ సందర్భంగా కోరాడు.
Also Read: Tourist Family Beats Chhaava: ‘చావా’ నే దాటేసిన ‘టూరిస్ట్ ఫ్యామిలీ’!
సినిమాని కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని, రాబోయే రోజుల్లో దీని పై నిర్మాతలతో, పంపిణీదారులతో కూర్చొని చర్చిస్తామని చెప్పుకొచ్చాడు విశాల్. ఇదంతా పక్కన పెడితే మంచు విష్ణు తన ‘కన్నప్ప’ సినిమాకు ఈ మోడల్ ని విజయవంతంగా అనుసరించాడు. పేరు మోసిన ప్రముఖ రివ్యూయర్స్ ఎవ్వరూ కూడా ఈ సినిమా గురించి మూడు రోజుల వరకు ఎలాంటి రివ్యూ ఇవ్వలేదు. గడిచిన రెండు దశాబ్దాలలో ఎప్పుడూ ఇలాంటి సంఘటన చూడలేదు. మంచు విష్ణు కేవలం తన సినిమా కోసం మాత్రమే కాదు, మా ప్రెసిడెంట్ గా ఇండస్ట్రీ లో అన్ని సినిమాలకు ఇదే మోడల్ ని అనుసరించాలి అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కోరుకుంటున్నారు. కన్నప్ప చిత్రానికి రివ్యూస్ ని ఆపడం వల్ల మొదటి మూడు రోజులు చాలా డీసెంట్ స్థాయి వసూళ్లు నమోదు అయ్యాయి. భవిష్యత్తులో విశాల్ ని చూసి అయినా మంచు విష్ణు ఈ నిర్ణయం తీసుకుంటాడో లేదో చూడాలి.