Hero Vishal : తమిళ హీరో విశాల్(Vishal Reddy) పెళ్లి గురించి ఇప్పటి వరకు ఎన్నో వార్తలను మనం మీడియా లో చూస్తూనే ఉన్నాం. నిన్నగాక మొన్న అభినయ అనే నటి నిశ్చితార్థం చేసుకొని పెళ్లి కొడుకు ముఖం చూపించకుండా, కేవలం చేతికి తొడిగిన ఉంగరాన్ని మాత్రమే చూపించడం తో సోషల్ మీడియా లో నెటిజెన్స్ పెళ్లి కొడుకు విశాల్ అయ్యి ఉంటాడని అందరూ కామెంట్స్ చేశారు. కానీ చివరికి నెటిజెన్స్ అనుకున్నది కాదని తెలిసింది. అదే విధంగా గతంలో వరలక్ష్మి శరత్ కుమార్ తో కూడా విశాల్ డేటింగ్ చేస్తున్నాడని, త్వరలో వీళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. కానీ అది కూడా నిజం కాదని తెలిసింది. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా ప్రముఖ యంగ్ హీరోయిన్ సాయి ధన్సిక(Sai Dhanshika) తో విశాల్ ప్రేమాయణం నడుపుతున్నట్టు, గత కొంతకాలం గా వీళ్ళు డేటింగ్ లో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read : ఓటీటీ లోకి వచ్చేసిన నాని ‘హిట్ 3’..ఎందులో చూడాలంటే!
సాయి ధన్సిక అంటే మీకు వెంటనే గుర్తుకు రాకపోవచ్చు, సూపర్ స్టార్ రజినీకాంత్ కెరీర్ లో కనీవినీ ఎరుగని రేంజ్ భారీ అంచనాల నడుమ విడుదలైన ‘కబాలి’ చిత్రాన్ని అంత తేలికగా ఎవరైనా మర్చిపోగలరా..?, భారీ అంచనాల కారణంగా ఈ సినిమా అనుకున్న టార్గెట్ ని చేరుకోలేకపోయింది కానీ తమిళనాడు వరకు ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది. ఈ చిత్రం లో రజినీకాంత్ కి కూతురిగా నటించింది సాయి ధన్సిక. ఆమె క్యారెక్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది కూడా. భవిష్యత్తులో పెద్ద హీరోయిన్ అవుతుంది అనుకున్నారు కానీ, ఆమె కేవలం లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు మాత్రమే పరిమితమైంది. ఆ కారణం చేత పెద్ద రేంజ్ కి వెళ్లలేకపోయింది, ఈమె నటించిన సినిమాలు ఒక్కటి కూడా కమర్షియల్ గా హిట్ అవ్వలేదు. అంతే కాకుండా ఇప్పటి వరకు విశాల్ తో కలిసి సాయి ధనిష్క ఒక్క సినిమాలో కూడా నటించలేదు.

అయినప్పటికీ వీళ్లిద్దరి మధ్య ఈ రూమర్స్ ఎలా పుట్టాయి అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. నిప్పు లేనిదే పొగ రాదనీ పెద్దలు అంటూ ఉంటారు. నాగ చైతన్య, శోభిత లు కూడా కలిసి ఒక్క సినిమా చేయలేదు. అయినప్పటికీ వీళ్లిద్దరు ప్రేమించుకుంటున్నారు అంటూ అప్పట్లో వార్తలు వస్తే ఎవ్వరూ నమ్మలేదు. కానీ చివరికి వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. విశాల్, సాయి ధన్సిక లు కూడా అదే తరహా లో పెళ్లి చేసుకుంటారని అంటున్నారు నెటిజెన్స్. రీసెంట్ గానే విశాల్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ‘కచ్చితంగా పెళ్లి చేసుకుంటాను. నాకు కావాల్సిన ప్రేమ దొరికింది. ప్రేమ పెళ్లి మాత్రమే చేసుకుంటాను’ అంటూ చెప్పుకొచ్చాడు. గతంలో విశాల్ అనీషా అనే ప్రముఖ నటితో నిశ్చితార్థం చేసుకున్నాడు. కానీ కొన్ని కారణవల్ల పెళ్లి వరకు వెళ్ళలేదు, నిశ్చితార్థం రద్దు అయ్యింది.