https://oktelugu.com/

Hero Vikram :  కంటి చూపు కోల్పోయిన హీరో విక్రమ్..ఇంత సాహసం ఇండియాలో ఎవరూ చేయలేరేమో!

విక్రమ్ గురించి ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మేము మీ ముందు ఉంచబోతున్నాము. ఇది చూసాక అతని డెడికేషన్ కి చేతులెత్తి దండం పెట్టక తప్పదు. పూర్తి వివరాల్లోకి వెళ్తే 2001 వ సంవత్సరంలో వినయం అనే తమిళ దర్శకుడితో విక్రమ్ 'కాశీ' అనే చిత్రం చేసాడు. ఈ సినిమా అప్పట్లో తమిళనాడులో పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది.

Written By:
  • Vicky
  • , Updated On : September 4, 2024 / 07:10 PM IST

    Hero Vikram

    Follow us on

    Hero Vikram :  కొంతమంది హీరోలు సినిమా కోసం, పాత్ర కోసం ప్రాణాలను కూడా రిస్క్ లో పెట్టేస్తుంటారు. అలాంటోళ్ళు ఇండస్ట్రీ కి దొరకడం నిజంగా ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టమే. పైసా కూడా అక్కర్లేదు ఒక మంచి పాత్ర ఇస్తే చాలు అనే ఆకలి మీద ఉండే హీరోలు మన సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో చాలామంది ఉన్నారు. అలాంటి హీరోలలో ఒకరు చియాన్ విక్రమ్. శివపుత్రుడు సినిమాతో ఈయన మన టాలీవుడ్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సంపాదించాడు. ఆ తర్వాత ఆయన శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అపరిచితుడు’ అనే చిత్రం తో సౌత్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ షేక్ చేసాడు. తెలుగులో ఈ సినిమాతో ఆయనకీ రజినీకాంత్ రేంజ్ మార్కెట్ ఏర్పడింది. కానీ ఆ మార్కెట్ ని ఆయన ఎక్కువ కాలం నిలబెట్టుకోలేకపోయాడు. వరుసగా ప్రయోగాలు చేస్తూ ఫ్లాప్స్ ని మూటగట్టుకున్నాడు. రీసెంట్ గానే ఆయన ‘తంగలాన్’ చిత్రం తో మన ముందుకు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం కూడా కమర్షియల్ గా ఫ్లాప్ అయ్యింది కానీ, విక్రమ్ నటనకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

    ఇదంతా పక్కన పెడితే విక్రమ్ గురించి ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మేము మీ ముందు ఉంచబోతున్నాము. ఇది చూసాక అతని డెడికేషన్ కి చేతులెత్తి దండం పెట్టక తప్పదు. పూర్తి వివరాల్లోకి వెళ్తే 2001 వ సంవత్సరంలో వినయం అనే తమిళ దర్శకుడితో విక్రమ్ ‘కాశీ’ అనే చిత్రం చేసాడు. ఈ సినిమా అప్పట్లో తమిళనాడులో పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇదే సినిమాని తెలుగు లో ప్రముఖ సింగర్ ఆర్ఫీ పట్నాయక్ హీరోగా ‘శ్రీను వాసంతి లక్ష్మి’ అనే పేరుతో తెరకెక్కింది. ఇది ఇలా ఉండగా కాశీ చిత్రంలో విక్రమ్ గుడ్డివాడిగా అద్భుతంగా నటిస్తాడు. అలా నటించినందుకు తనకి ఎదురైన కొన్ని ఇబ్బందులను ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు విక్రమ్.

    ఆయన మాట్లాడుతూ ‘నేను ప్రతి సినిమాలోనూ కొత్తదనం గా ఉండేలా, నా పాత్ర ఆడియన్స్ ని థ్రిల్ కి గురి చేసేలా చూస్తుంటాను. రెగ్యులర్ పాత్రలు చెయ్యడం నాకు ఇష్టం ఉండదు. సినిమాలోని కథకి తగ్గట్టు నన్ను నేను మార్చుకోడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటాను. అందుకోసం నేను చేసే ప్రయత్నాలు ఒక్కోసారి నా ప్రాణాలకు విషం గా కూడా మారింది. ఉదాహారానికి నేను కాశీ అనే చిత్రం లో నటించాను. అందులో నాది గుడ్డివాడి పాత్ర కాబట్టి సినిమా పూర్తి అయ్యే వరకు కళ్ళు పైకి ఎత్తి నటించాల్సి వచ్చింది. అలా చెయ్యడం వల్ల కంటి చూపు మీద ప్రభావం చూపించింది. మూడు నెలల పాటు నాకు కళ్ళు సరిగా పనిచేయలేదు. డాక్టర్లు మెల్ల కన్ను వచ్చే ప్రమాదం కూడా ఉందని హెచ్చరించారు’ అంటూ ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.