Daavudi Song from Devara : ఎన్టీఆర్ గత చిత్రం ఆర్ ఆర్ ఆర్ విడుదలై రెండేళ్లు కావస్తుంది. ఫ్యాన్స్ ఆయన్ని సిల్వర్ స్క్రీన్ పై చూడాలని తహతహలాడుతున్నారు. అరవింద సమేత వీర రాఘవ 2018లో విడుదల కాగా… గత ఆరేళ్లల్లో ఎన్టీఆర్ చేసింది ఒక ఆర్ ఆర్ ఆర్ మాత్రమే. ఈ చిత్రం ఎన్టీఆర్ ఇమేజ్ తారా స్థాయికి చేర్చింది. ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరోల లిస్ట్ లో చేరాడు. ఆర్ ఆర్ ఆర్ వంటి ఇండస్ట్రీ హిట్ అనంతరం ఎన్టీఆర్ నుండి వస్తున్న దేవర చిత్రం పై అంచనాలు భారీగా ఉన్నాయి.
దేవర మూవీ సమ్మర్ కానుకగా ఏప్రిల్ 5న విడుదల కావాల్సింది. షూటింగ్ ఆలస్యం కాగా… వాయిదా పడింది. సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ ఐదు భాషల్లో విడుదల చేస్తున్నారు. దేవర విడుదలకు మరో మూడు వారాల సమయం మాత్రమే ఉంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ జోరు పెంచారు. ఒక్కో సాంగ్ విడుదల చేస్తున్నారు. ఫస్ట్ సింగిల్ గా ‘ఫియర్ సాంగ్’ వచ్చింది. ఈ సాంగ్ లో ఎన్టీఆర్ పాత్ర ఎంత రౌద్రంగా ఉంటుందో తెలియజేశారు.
అనంతరం ‘చుట్టమల్లే’ అంటూ ఓ రొమాంటిక్ సాంగ్ విడుదల చేశారు. ఈ సాంగ్ లో ఎన్టీఆర్-జాన్వీ కపూర్ కెమిస్ట్రీ ఆకట్టుకుంది. మూడో సాంగ్ సెప్టెంబర్ 4న విడుదలైంది. ఈసారి మాస్ బీట్ తో వచ్చాడు ఎన్టీఆర్. దావూదీ… పేరుతో విడుదలైన థర్డ్ సింగ్ మైండ్ బ్లాక్ చేసేలా ఉంది. చాలా కాలం అనంతరం ఎన్టీఆర్ ఎనర్జిటిక్ స్టెప్స్ చూసే ఛాన్స్ దక్కింది. 40 ప్లస్ లో ఎన్టీఆర్ స్పీడ్ చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు.
ఎన్టీఆర్ తో డాన్స్ చేసేందుకు జాన్వీ చాలా కష్టపడిందని ఆ సాంగ్ చూస్తే అర్థం అవుతుంది. జాన్వీ కపూర్ గ్లామర్ సైతం హైలెట్ గా ఉంది. అనిరుధ్ రవిచంద్రన్ ఈ సాంగ్ కి కంపోజ్ చేశారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. నకష్ అజీజ్, ఆకాశ పాడారు. మొత్తంగా దావూదీ సాంగ్ ఆకట్టుకుంది.