https://oktelugu.com/

Devara Movie : దేవర విషయం లో మరోసారి దెబ్బేసిన అనిరుధ్…ఎందుకిలా చేస్తున్నాడు..?

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తున్న క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ లాంటి హీరో కూడా దేవర సినిమాతో పాన్ ఇండియాలో సోలోగా తన స్టామినా ఏంటో నిరూపించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు... ఇక ఇంతకుముందు త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియాలో సక్సెస్ ని అందుకున్న ఎన్టీఆర్ సోలోగా మాత్రం ఇప్పటివరకు ఒక్క పాన్ ఇండియా సినిమాను కూడా రిలీజ్ చేయలేకపోయాడు...

Written By:
  • Gopi
  • , Updated On : September 4, 2024 / 07:40 PM IST

    Anirudh Music director

    Follow us on

    Devara Movie :  తెలుగు సినిమా ఇండస్ట్రీ లో జూనియర్ ఎన్టీఆర్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ఆయన చేసిన సినిమాలు ఆయనను చాలా కొత్తగా పరిచయం చేయడమే కాకుండా ఆయనకు ఉన్న క్రేజ్ ని కూడా మనకు పరిచయం చేస్తూ ఉంటాయి. ఇక దేవర సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆయన ప్రమోషన్స్ ను భారీ రేంజ్ లో ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక గత కొద్దిసేపటి క్రితమే ఈ సినిమా నుంచి ‘దావుదీ’ అనే సాంగ్ రిలీజ్ అయింది.

    అయితే ఈ సాంగ్ ఆశించిన మేరకు ప్రేక్షకులను అలరించే విధంగా అయితే లేదు. ఇక గత రెండు సాంగ్స్ తో కూడా అనిరుధ్ నిరాశపరిచిన విషయం మనకు తెలిసిందే. ఇక మూడో సాంగ్ తో అయిన ప్రేక్షకుల్లో,అభిమానుల్లో జోష్ నింపుతాడు అనుకున్న అనిరుధ్ మూడో సాంగ్ ని కూడా చాలా వరస్ట్ గా ఇవ్వడమే కాకుండా సినిమా మీద అంచనాలు ఏమాత్రం లేకుండా చేస్తున్నాడు. మరి ఇలాంటి సందర్భంలో అనిరుధ్ ఎందుకు దేవర సినిమా మీద ఇంత పగబట్టాడు అని ఎన్టీఆర్ అభిమానులు కూడా వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

    అసలు ఒక్క సాంగ్ కూడా ఈ సినిమాకి సెట్ అయ్యే సాంగ్స్ ఇవ్వలేకపోతున్నాడు అనిరుధ్ కి బదులు తమన్ గానీ లేదంటే దేవిశ్రీప్రసాద్ గాని పెట్టుకున్నా సాంగ్స్ అనేవి చాలా బాగా వచ్చుండేవి అంటూ చాలామంది సినీ విమర్శకులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు. ఇక అనిరుధ్ తమిళ్ సినిమాలకు తప్ప తెలుగులో సినిమాలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు అనేది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తుంది. అందుకే అనిరుధ్ కి బదులు వేరే తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ ను పెట్టుకుంటే బాగుండేదని కొరటాల శివ కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక సాంగ్స్ విషయం లోనే ఇలాంటి వైఖరిని పాటిస్తున్న అనిరుధ్ ఇంకా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎంత వరస్ట్ గా ఇస్తాడో అంటూ అతని అభిమానులు చాలా వరకు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు…

    ఇక మొత్తానికైతే సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ అవుతున్న ‘దేవర ‘ సినిమా భారీ రికార్డులను బ్రేక్ చేస్తుందని అందరూ నమ్ముతున్నారు. మరి ఇలాంటి సందర్భంలో ఈ సినిమా నుంచి ఇలాంటి ఒక నాసిరకం సాంగ్స్ ను ఇవ్వడం అనేది ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు. చూడాలి మరి ఇకమీదట వచ్చే సాంగ్స్ తో గాని, ట్రైలర్ తో గాని ఈ సినిమా మీద అంచనాలు పెంచుతాడేమో…