https://oktelugu.com/

EPF : ఈపీఎఫ్ పై కేంద్రం శుభవార్త.. ఇక ఏ బ్యాంకు నుంచైనా..

ప్రైవేట్ ఉద్యోగులకు ఈపీఎఫ్ విధానం ద్వారా ప్రతినెల కొంత మొత్తాన్ని జమ చేస్తూ వస్తుంటారు. ఈ మొత్తాన్ని వడ్డీతో కలిపి పదవీ విరమణ పొందిన తరువాత చెల్లిస్తారు. అయితే పదేళ్ల పాటు నిర్విరామంగా ఈపీఎఫ్ ఖాతాను కొనసాగిస్తే పదవీ విరమణ తరువాత పింఛన్ పొందే అవకాశం ఉంటుంది. ఈ పింఛన్ వారి జమ చేసిన మొత్తాన్ని బట్టి ఉంటుంది.

Written By:
  • Srinivas
  • , Updated On : September 5, 2024 / 07:53 PM IST

    EPF

    Follow us on

    EPF : ఈపీఎఫ్ వినియోగదారులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. దీనికి సంబంధించి ఇక ఏ బ్యాంకు నుంచైనా పింఛన్ తీసుకోవాడానికి వెసులుబాటు కల్పించింది. పదవీ విరమణ తరువాత ఈపీఎఫ్ ద్వారా పింఛన్ పొందే వారికి ఇది ఉపయోగపడనుంది. ఈ కొత్త విధానాన్ని ఆమోదిస్తూ కేంద్రం తాజాగా నిర్ణయం తీసుకుంది. దీంతో 78 లక్షల మందికి ఈ ప్రయోజనం చేకూర నుంచి ఇప్పటి వరకు పదవీ విరమణ తరువాత పింఛన్ పొందాలంటే సంబంధిత బ్యాంకు నుంచి మాత్రమే పొందే అవకాశం ఉండేది.కానీ కొత్త విధానం ద్వారా ఈ సదుపాయాన్ని సులభరతం చేసింది. దీనిని 2025 జనవరి 1 నుంచి అమలు చేయనున్నారు. ఈ కొత్త విధానం ప్రైవేట్ ఉద్యోగులకు లాభం చేకూరనుంచి. పూర్తి వివరాల్లోకి వెళితే..

    ప్రైవేట్ ఉద్యోగులకు ఈపీఎఫ్ విధానం ద్వారా ప్రతినెల కొంత మొత్తాన్ని జమ చేస్తూ వస్తుంటారు. ఈ మొత్తాన్ని వడ్డీతో కలిపి పదవీ విరమణ పొందిన తరువాత చెల్లిస్తారు. అయితే పదేళ్ల పాటు నిర్విరామంగా ఈపీఎఫ్ ఖాతాను కొనసాగిస్తే పదవీ విరమణ తరువాత పింఛన్ పొందే అవకాశం ఉంటుంది. ఈ పింఛన్ వారి జమ చేసిన మొత్తాన్ని బట్టి ఉంటుంది. అయితే ఈ పింఛన్ ను విత్ డ్రా చేసుకోవడానికి ఇప్పటి వరకు ఒకే బ్యాంకు నుంచి తీసుకోవాలన్న నిబంధన ఉండేది. ఇప్పటి ప్రభుత్వం ఆమోదించిన ఏ బ్యాంకు నుంచి అయినా తీసుకోవచ్చు.

    కాలం మారుతున్న కొద్దీ కొన్ని సదుపాయాలను సులభతరం చేయాలని కేంద్ర భావిస్తోంది. ముఖ్యంగా ఈపీఎఫ్ విషయంలో కొన్ని నిబంధనలు మారుస్తూ వస్తోంది. గతంలో ఈపీఎఫ్ లో జమ చేసిన మొత్తంలో 75 శాతం మాత్రమే ముందస్తుగా తీసుకునే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు మెడికల్ అవసరాల కోసం 90 శాత కూడా విత్ డ్రా చేసుకునే సదుపాయం కల్పించింది. అంతేకాకుండా వీటిని విత్ డ్రా చేసుకునే సమయంలో కొన్ని నిబంధనలను సులభతరం చేసింది. గతంలో మాన్యువల్ గా దరఖాస్తు చేసుకుంటే విత్ డ్రాకు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ఎక్కడి నుంచైనా ఆన్ లైన్ లో దరకాస్తు చేసుకోవచ్చు.

    ఇక గత జూలై నుంచి ఈపీఎప్ అవుట్ గోయింగ్ సభ్యులకు వడ్డీ చెల్లింపులు విడుదల చేయడం ప్రారంభించింది. 2023 -24 సంవత్సరానికి 8.25 శాతం వడ్డీని నిర్ణయించి 23.04 లక్షల సభ్యులకు రూ.9,260 కోట్లు చెల్లించింది. 2022-23 లో ఈ వడ్డీ 8.15 శాతం ఉండగా తాజాగా దీనిని 8.25 కు పెంచారు. ఈ వడ్డీ చెల్లింపులను ఐటీ, బ్యాంకింగ్ సెక్టార్ లను సులభతరం చేసి చెల్లింపులు చేస్తోంది. గతంలో ఈ చెల్లింపులు కాస్త కష్టంగా ఉండేవి. కానీ ఆధునీకీకరణలో భాగంగా సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమేంట్ సిస్టమ్ ఆమోదం ద్వారా ఈ వడ్డీని చెల్లించారు. ఈ ఈపీఎఫ్ వడ్డీని 2024 మే 6న ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదించగా.. మే 24 నాటికి కార్మిక మంత్రి త్వ శాఖ ద్వారా కొత్త వడ్డీని చెల్లిస్తున్నట్లు తెలిపింది.