Hero Vikram Injured: విభిన్నమైన పాత్రలు పోషిస్తూ సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరో విక్రమ్. తమిళం లో ఎన్నో కమర్షియల్ సూపర్ హిట్స్ ని అందుకొని పెద్ద స్టార్ హీరో గా నిలిచాడు. కమల్ హాసన్ తర్వాత అన్నీ రకాల పాత్రలు పోషించిన ఏకైక హీరో ఒక్క విక్రమ్ మాత్రమే.
అయితే పాత్ర మేక్ ఓవర్ కోసం ప్రాణాలను సైతం రిస్క్ లో పెట్టె అలవాటు ఉన్న విక్రమ్ రీసెంట్ గా ‘కబాలి’ దర్శకుడు PA రంజిత్ దర్సకత్వం లో తెరకెక్కుతున్న ‘తంగాలన్’ అనే చిత్రం లో విచిత్రమైన గెటప్ లో కనిపించి, అసలు మనం చూస్తున్న హీరో విక్రమేనా అని అనిపించేంతలా మేక్ ఓవర్ అయ్యాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది, ఇందులో మాళవిక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది.
అయితే ఈ సినిమా షూటింగ్ చేస్తున్న సమయం లో విక్రమ్ కి చాలా తీవ్రమైన గాయం అయ్యిందట.ఆయన పక్కటెముక కూడా విరిగిపోయిందట, పరిస్థితి తీవ్ర రూపం దాల్చడం తో ఆయనని వెంటనే హాస్పిటల్ కి చేర్చి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఆయన తొందరగా కోలుకోవాలని, మళ్ళీ షూటింగ్ లో పాల్గొనాలని ఆయన అభిమానులు ప్రార్థిస్తున్నారు. కొద్దిరోజుల క్రితమే విక్రమ్ కి గుండెపోటు రావడం తో ఆయనని హాస్పిటల్ లో చేర్చిన విషయం తెలిసిందే.
సురక్షితంగా ఆయన ప్రాణాలతో బయటపడ్డారు, ఈ గ్యాప్ లో ఆయన పై మీడియా లో వచ్చిన అసత్య వార్తలపై కూడా విరుచుకుపడ్డాడు. రీసెంట్ గానే విక్రమ్ నటించిన ‘పొన్నియన్ సెల్వన్ 2 ‘ గ్రాండ్ గా విడుదలై, బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న సమయం లో ఆయనకీ ఇలా జరగడం విచారకరం.