Comedian Manobala Passed Away: ఈమధ్య కాలం లో మన ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ఎంతో మంది లెజండరీ నటులను కోల్పోయింది. వీళ్ళు లేని లోటుని ఎవ్వరూ పూడవలేనిది, అలాంటి స్థాయి ఉన్న నటులను మనం గడిచిన రెండు మూడు సంవత్సరాలలో కోల్పోయాము.ఈ బాధని ఇంకా దిగమింగక ముందే మరో లెజండ్ ని మనం కోల్పోయాము.
ఆయన మరెవరో కాదు, తమిళం లో ఎన్నో వందల సినిమాల్లో కమెడియన్ గా నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న మనోబాల. మన టాలీవుడ్ లో బ్రహ్మానందం మరియు MS నారాయణ ఎలా అయితే కామెడీ కింగ్స్ గా కొనసాగేవారో, మనోబాల కూడా అక్కడ అలాంటి స్టార్ కమెడియన్. ఈయన లేని సినిమా అంటూ ఉండేది కాదు, అయితే గత కొంతకాలం నుండి ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండడం వల్ల సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు.
ఈయన చంద్రముఖి, గజినీ , సింగం , కాంచన , స్నేహితుడు , భవాని , లింగా, తుపాకీ మరియు రాజారాణి వంటి సినిమాలతో తెలుగు ఆడియన్స్ కి కూడా సుపరిచితుడు. తెలుగు లో కూడా ఆయన రాజాధి రాజా, డేగ , మనసు మాయ సెయ్యకే, పున్నమి నాగు, కథానాయకుడు , మహానటి ఇలా ఎన్నో సినిమాల్లో నటించాడు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీ హిట్ చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో కూడా ఆయన నటించాడు.
ఇందులో ఆయన జడ్జి గా నటించిన సంగతి తెలిసిందే, ఇదే ఆయన ఆఖరి చిత్రం అవ్వడం విశేషం. ఈయన కేవలం నటుడిగా మాత్రమే కాదు, నిర్మాతగా మరియు దర్శకుడిగా కూడా తమిళ సినిమా ఇండస్ట్రీ లో గొప్పగా రాణించాడు.అలాంటి లెజెండ్ ఈరోజు మన అందరిని వదిలి తిరిగిరాని లోకాలకు ప్రయాణం అవ్వడం దురదృష్టకరం. ఆయన ఆత్మా ఎక్కడున్నా శాంతిని కోరుకోవాలని మనస్ఫూర్తిగా ఆ దేవుడికి ప్రార్థన చేద్దాము.