Groom Arrested: తాళికట్టే సమయానికి పెళ్లిమండపంలోకి పోలీసులు.. ఆ తరువాత..

ఒడిశాలోని ఓ పెళ్లి మంటపంలోకి అతిథులకు బదులుగా కొందరు పోలీసులు వచ్చారు. పెళ్లికొడుకు కోసం ఆరా తీశారు. చివరికి అతనిని గుర్తించిన వారు అరెస్టు చేసి జైలుకు వెళ్లాడు.

Written By: Srinivas, Updated On : May 3, 2023 2:01 pm
Follow us on

Groom Arrested: అటు 7 తరాలు.. ఇటు 7 తరాలు చూసిన తరువాతే పెళ్లి చేయాలని ఒకప్పుడు పెద్దలు భావించేవారు. అందుకే ఆ కాలంలో పెళ్లిళ్లు కలకాలం నిలిచేవి. కానీ రాను రాను ఈ సంస్కృతి పూర్తిగా మారిపోయింది. క్షణంలో ప్రేమ పుట్టిందంటూ చాలా మంది భార్యభర్తలుగా మారిపోతున్నారు. అయితే ఈ ప్రేమ అనే వలలో పడి చాలా మంది అమ్మాయిలు నష్టపోతున్నారు. మాయమాటలు చెబుతున్న కొందరు అబ్బాయిలు ప్రేమిస్తున్నానంటూ.. ఒకరిని ప్రేమించి.. మరొకరిని పెళ్లి చేసుకుంటున్నారు. ఇలాంటి వారి విషయంలో కొందరు అమ్మాయిలు తమలో తామే కుంగిపోతుండగా.. మరికొందరు మాత్రం చురుకుగా వ్యవహరించి మోసగాళ్ల బండారం బయడపెడుతున్నారు.ఇలాంటి సంఘటనే ఒడిశాలో తాజాగా చోటు చేసుకుంది.

ఒడిశాలోని ఓ పెళ్లి మంటపంలోకి అతిథులకు బదులుగా కొందరు పోలీసులు వచ్చారు. పెళ్లికొడుకు కోసం ఆరా తీశారు. చివరికి అతనిని గుర్తించిన వారు అరెస్టు చేసి జైలుకు వెళ్లాడు. పెళ్లి మండపంలో తాళి కట్టాల్సిన వరుడు జైలుకు వెళ్లాల్సిన వరుడు ఇలా జైలుకు ఎందుక వెళ్తున్నారని అందరూ ఆరా తీశారు. దీంతో అక్కడున్న పోలీసులు ప్రాథమికంగా వారు ఎందుక అరెస్టు చేస్తున్నారో చెప్పాడు.

బార్ గఢ్ జిల్లాలోని ఢెంకనాల్ క చెందిన అజిత్ కుమార్ ఆర్టీసీ ఉద్యోగం చేస్తున్నాడు. ఇదే జిల్లాలోని ఓ యువతిని ప్రేమించాడు. తనను పెళ్లి చేసుకుంటానని కబుర్లు చెప్పి ఆమెతో కలిసి తిరిగాడు. భవిష్యత్ లో ఎలాంటి జీవితం ఉంటుందో ఆమెకు కళ్లకు కట్టినట్లు చూపించాడు. దీంతో అతనిని ఆ అమ్మాయి బాగా నమ్మింది. కానీ ఈమెను కాదని మరో యువతితో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఏప్రిల్ 25న బెహెరాపాలి గ్రామానికి చెందిన యువతిని పెళ్లి చేసుకునేందుకు రెడీ అయ్యారు.

మోసపోయానని తెలుసుకున్న ప్రియురాలు పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులతో సహా పెళ్లి మండపానికి వచ్చారు. వెంటనే అక్కడున్న పెళ్లికొడుకును అరెస్టు చేసుకొని తీసుకెళ్లారు. ప్రేమ కారణంగా మోసపోయిన యువతులు జీవితాలు నాశనమైన ఘటనలు ఎన్నో బయటకు వస్తున్నాయి. కానీ అయినా కొందరు అమ్మాయిలు మోసగాళ్ల మాయలో పడుతున్నారు. ఇప్పటికైనా యువతులు ప్రేమించే సమయంలో వ్యక్తుల గురించి పూర్తిగా తెలుసుకోవాలని సూచనలిస్తున్నారు.