Hero Vijay Political Entry: తమిళనాడు లో ప్రస్తుతం తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ని ఎంజాయ్ చేస్తున్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది ఇళయ తలపతి విజయ్ అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు..రజిని కాంత్ తర్వాత అన్ని వర్గాల్లో అదే స్థాయి ఫాలోయింగ్ ని సంపాదించిన హీరో ఈయనే..దానికి తోడు గత దశాబ్ద కాలం నుండి ఈయన ఫిల్మోగ్రఫీ మొత్తం 90 శాతం సక్సెస్ రేట్ తో దూసుకుపోయింది..ఇటీవలే ఆయన హీరో గా నటించిన బీస్ట్ సినిమాకి యావేరేజి టాక్ వచ్చినా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం కలెక్షన్ల సునామి ని సృష్టిస్తూ ముందుకు దూసుకుపోతుంది..

ఇంతతి క్రేజ్ ఉన్న ఒక్క స్టార్ రాజకీయాల్లోకి వస్తే కచ్చితంగా ప్రభంజనం సృష్టిస్తాడు అనే చెప్పొచ్చు..విజయ్ ఎంతో కాలం నుండి రాజకీయాల్లోకి రావడానికి చూస్తున్నారు అని వార్త ప్రచారం లో ఉన్న సంగతి మన అందరికి తెలిసిందే.. దీని గురించి లేటెస్ట్ గా విజయ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో కదలికలు సృష్టిస్తుంది..బీస్ట్ సినిమా ప్రొమోషన్స్ లో భాగంగా విజయ్ ఇటీవలే ఆ చిత్ర దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తో ఒక్క ప్రత్యేకమైన ఇంటర్వ్యూ ఇచ్చాడు..దాదాపుగా పదేళ్ల తర్వాత ఆయన మీడియా ముందుకి వచ్చి ఒక్క ఇంటర్వ్యూ ఇవ్వడం ఇదే తోలిసారి..ఈ ఇంటర్వ్యూ విశేషాలు ఏమిటో ఇప్పుడు మనం చూడబోతున్నాము.
ఈ ఇంటర్వ్యూ లో బీస్ట్ సినిమా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ విజయ్ ని ఎంతో ఆసక్తికరమైన ప్రశ్నలు అడిగాడు..ముందుగా ఆయన మాట్లాడుతూ ‘దాదాపుగా పదేళ్ల నుండి మీరు మీడియా కి దూరంగా ఉంటూ వస్తున్నారు..ఎందుకని అలా చేసారు..మీకు సమయం లేక మీడియా ముందుకి రాలేదా?,లేకపోతే రావడానికి ఇష్టం లేదా?’ అని నెల్సన్ అడిగిన ప్రశ్న కి విజయ్ సమాధానం చెప్తూ ‘సమయం లేకపోవడం వల్ల మీడియా ముందుకు రాలేదు అని అనడం లో ఎలాంటి నిజం లేదు..నేను మరీ అంత బిజీ ఏమి కాదు..తల్చుకుంటే ఎదో ఒక్క టైం ని కేటాయించి మీడియా ముందుకి రాగలను..కానీ పదేళ్ల క్రితం నేను మీడియా ముందుకి వచ్చినప్పుడు నేను మాట్లాడిన కొన్ని మాటలను ట్విస్ట్ చేసి చూపించారు..అప్పుడు మీడియా ముందుకు రావడానికి ఇష్టపడలేదు..అలా గాప్ పెరుగుతూ పొయ్యి ఇన్ని సంవత్సరాల సమయం పట్టింది’ అంటూ చెప్పుకుకొచ్చాడు విజయ్..నెల్సన్ మాట్లాడుతూ ‘ఈ మధ్య మీరు చేసే ప్రతి సినిమాలో ఎదో ఒక్క సామజిక స్పృహ ఉన్న సందేశాలు ఉంటున్నాయి..మీరు రాజకీయాల్లోకి కూడా రాబోతున్నారు అని చాలా కాలం నుండి ఒక్క వార్త మీడియా లో ప్రచారం లో ఉన్నది..నిజంగా మీరు రాజకీయాల్లోకి రాబోతున్నారా’ అని అడిగిన ప్రశ్న కి విజయ్ సమాధానం చెప్తూ ‘నేను రాష్ట్ర రాజకీయాల గురించి ఈమధ్య స్పష్టంగా అన్నీ గమనిస్తున్నాను..ఎప్పుడు రాజకీయాల్లోకి రావాలి అనేది నా చేతుల్లో లేదు..అది అభిమానుల చేతుల్లో ఉన్నది’ అంటూ చెప్పుకొచ్చాడు విజయ్.
Also Read: కేజీఎఫ్ సంచలనం.. ఆర్ఆర్ఆర్.. బాహుబలి రికార్డులు బ్రేక్..!
విజయ్ కి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తో ఎంతో మంచి సన్నిహిత్య సంబంధాలు ఉన్నాయి..గతం లో కొన్ని సందర్బాలలో ఆయనకీ సపోర్టు గా నిలిచి అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మీద కొన్ని కామెంట్స్ కూడా చేసాడు..ఆమె అది దృష్టిలో పెట్టుకొని విజయ్ ప్రతి సినిమాకి అప్పట్లో అడ్డంకులు పెట్టేది..ఇప్పుడు విజయ్ తనకి ఎంతో ఆప్తుడు అయిన తమిళ నాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కి ఎదురెళ్లి సొంతంగా పార్టీ పెట్టి ఎన్నికల బరిలో దిగుతాడా..లేదా DMK పార్టీ నుండి ఎదో ఒక్క స్థానం నుండి పోటీ చేస్తాడా అనేది ప్రస్తుతం ప్రస్నార్ధకంగా మారింది..కానీ నిన్న ఇచ్చిన ఇంటర్వ్యూ లో భవిష్యత్తులో రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నాడు అనేది మాత్రం స్పష్టం అయ్యింది..ఒక్కసారి ఆయన ఎన్నికల సమయం లో ఓటు వెయ్యడానికి సైకిల్ మీద పోలింగ్ బూత్ కి వెళ్లిన వీడియో తెగ వైరల్ గా మారిన సంగతి మన అందరికి తెలిసిందే..ఈ వీడియో గురించి అప్పట్లో ఎన్నో కథనాలు వచ్చాయి..పెరుగుతున్న పెట్రోల్ మరియు డీసెల్ రేట్స్ కి నిరసనగా విజయ్ ఇలా చేసాడు అంటూ తమిళ మీడియా జోరుగా ప్రచారం చేసింది..ఈ వీడియో గురించి డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ విజయ్ ని అడగగా ఆయన దానికి సమాధానం చెప్తూ ‘ఆ వీడియో వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశ్యం లేదు..నేనేదో ఆరోజు సరదాగా సైకిల్ తొక్కాలి అనిపించి తొక్కుకుంటూ వెళ్ళాను’ఆ అంటూ చెప్పుకొచ్చాడు విజయ్.
Also Read: ఆ హీరోయిన్ తో నాగ చైతన్య రెండవ పెళ్లి??
[…] IPL 2022: ఐపీఎల్ లో ఇప్పటివరకు 5 సార్లు విజేతగా నిలిచి ట్రోఫీ సొంతం చేసుకున్న ముంబై ఇండియన్స్ టీం ఈ సీజన్లో రాణించలేకపోతోంది. వరుసగా ఐదు మ్యాచ్ లు ఓడిపోయింది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఐదో మ్యాచ్‌లో రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ జట్టు ఓటమిపాలైంది. పుణేలోని మహారాష్ట్ర క్రికెట్ స్టేడియంలో బుధవారం రాత్రి పంజాబ్ కింగ్స్ చేతిలో మట్టి కరిచింది. ప్రత్యర్థి నిర్దేశించిన లక్ష్యానికి 12 పరుగుల దూరంలోనే ఆగిపోయింది. ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ జట్టు పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది. […]