Venkatesh-Mahesh Babu: చిన్నోడు.. పెద్దోడా.. మహేష్ బాబుతో పోటీపై హాట్ కామెంట్స్ చేసిన హీరో వెంకటేష్

టీజర్ ఈవెంట్ లో పాల్గొన్న వెంకటేష్ మహేష్ బాబు మీద కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.ఇక ఈ టీజర్ తో పాటు గా సినిమా రిలీజ్ డేట్ ని కూడా సినిమా యూనిట్ తెలియజేయడం జరిగింది.ఇక ఈ సినిమా సంక్రాంతి కనుక గా జనవరి 13వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు గా ఇప్పటికే తెలియజేశారు.

Written By: Gopi, Updated On : October 16, 2023 5:53 pm
Follow us on

Venkatesh-Mahesh Babu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోల్లో విక్టరీ వెంకటేష్ ఒకరు. ఈయన తీసిన చాలా సినిమాలు మంచి విజయం సాధించడం తో ఆయన విక్టరీ వెంకటేష్ గా మంచి గుర్తింపు ను తెచ్చుకున్నాడు.ఇక ప్రస్తుతం ఆయన హిట్ సినిమా డైరెక్టర్ అయిన శైలేష్ కోలను డైరెక్షన్ లో సైంధవ్ అనే సినిమా చేస్తున్నారు.ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. ఇక ఈ టీజర్ ఈవెంట్ లో పాల్గొన్న వెంకటేష్ మహేష్ బాబు మీద కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.ఇక ఈ టీజర్ తో పాటు గా సినిమా రిలీజ్ డేట్ ని కూడా సినిమా యూనిట్ తెలియజేయడం జరిగింది.ఇక ఈ సినిమా సంక్రాంతి కనుక గా జనవరి 13వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు గా ఇప్పటికే తెలియజేశారు.

ఇక ఇది ఇలా ఉంటే ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా కూడా సంక్రాంతి కానుక గా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ ఈవెంట్ లో ఒక రిపోర్టర్ చిన్నోడు అయిన మహేష్ బాబు చేసిన గుంటూరు కారం సినిమాని జనవరి 12 న థియేటర్ లోకి తీసుకువస్తున్నారు.ఇక అదే టైంలో పెద్దోడైన మీరు కూడా మీ సినిమాతో వస్తున్నారు మీ ఇద్దరి మధ్య పోటీ చాలా గట్టిగానే ఉండనున్నట్టు గా తెలుస్తుంది దీనిమీద మీ అభిప్రాయం ఏంటి అని అడగగా దానికి వెంకటేష్ సమాధానం ఇస్తూ చిన్నోడు బరిలోకి దిగితే సూపర్ హిట్ వస్తుంది, అలాగే పెద్దోడు కూడా బరిలోకి దిగితే సూపర్ హిట్ వస్తుంది. మా కాంబినేషన్ ఎప్పటికైనా సూపర్ హిట్ అవుతుంది అందులో భాగంగా వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మీ అందరికీ తెలిసిందే…

ఇక ఇప్పుడు ఈ రెండు సినిమాలు కూడా సూపర్ హిట్ అవుతాయి అంటూ ఆయన ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు. వెంకటేష్ మాటలు పట్ల మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కానీ అన్నదమ్ములు లాగా కలిసి ఉండే వెంకటేష్, మహేష్ బాబు సినిమాల మధ్య పోటీ ఎందుకు ఇద్దరు ఒక్కసారి కాకుండా ఒక్కొక్క సరి సపరేట్ గా వస్తే బాగుండేది కదా అని వాళ్ల ఆవేదనని వ్యక్తం చేస్తున్నారు.

ఎందుకంటే రెండు సినిమాల్లో ఏ సినిమాకు హిట్ టాక్ వచ్చిన ఆ సినిమా మంచి విజయం సాధిస్తుంది.కానీ రెండు సినిమాలకు మంచి హిట్ టాక్ వస్తే మాత్రం కచ్చితంగా ఒక సినిమా కలక్షన్స్ అనేవి చాలా వరకు తగ్గుతాయి.ఇక ఈ టైంలో ఇద్దరి మధ్య పోటీ ఎందుకు అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.కానీ పండగ సీజన్ కాబట్టి ప్రతి ఒక్క సినిమా కూడా ఈ టైం లో రిలీజ్ చేస్తే మంచి కలక్షన్స్ వస్తాయి అలాగే మంచి విజయాన్ని కూడా అనుకుంటుంది అనే ఉద్దేశ్యం తోనే చాలా సినిమాలని పండుగ సీజన్ లలో రిలీజ్ చేసి మంచి కలెక్షన్స్ రాబడుతుంటారు మేకర్స్… ఇక ఆ ఉద్దేశ్యం తోనే పండగ సీజన్ లలో ఎన్ని సినిమాలు పోటీలో ఉన్న చాలాఎక్కువ సినిమాలు రిలీజ్ చేసే పనిలో ఉంటారు మేకర్స్…మరి సంక్రాంతి రేస్ లో పెద్దోడు గెలుస్తాడా,లేదా చిన్నోడు గెలుస్తాడా అనేది తెలియాలంటే సంక్రాంతి వరకు ఆగాల్సిందే…