https://oktelugu.com/

Amaravati Assigned lands case: చంద్రబాబు మెడకు మరో కేసు.. అమరావతి అసైన్డ్ భూముల కేసు రీఓపెన్

2021 లో అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో గోల్మాల్ జరిగిందని మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సిఐడి కి ఫిర్యాదు చేశారు. దీనిపైన సిఐడి విచారణ పూర్తి చేసింది.

Written By:
  • Dharma
  • , Updated On : October 16, 2023 / 05:47 PM IST
    Follow us on

    Amaravati Assigned lands case: చంద్రబాబు వరుస కేసులతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇప్పటికే స్కిల్స్ క్యాంప్ కేసులో గత 35 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఒక్క స్కిల్ స్కాం కేసే కాదు. ఫైబర్ నెట్, రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసు, అంగళ్ళ అల్లర్ల కేసుతో చంద్రబాబు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ సుప్రీంకోర్టులో మంగళవారం విచారణకు రానుంది. అటు బెయిల్ పిటిషన్ సైతం హైకోర్టులో మంగళవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఇటువంటి తరుణంలో అమరావతి అసైన్డ్ భూముల అవకతవకలకు సంబంధించి కేసు ఓపెన్ చేసేందుకు సిఐడి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

    2021 లో అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో గోల్మాల్ జరిగిందని మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సిఐడి కి ఫిర్యాదు చేశారు. దీనిపైన సిఐడి విచారణ పూర్తి చేసింది. ఈ కేసులో మాజీ మంత్రి నారాయణ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం తీర్పు ఇవ్వనుంది. సరిగ్గా ఇదే సమయంలో సిఐడి అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఈ కేసునకు సంబంధించి తాజాగా ఆధారాలు అందాయని చెబుతూ ఈ కేసు విచారణకు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. కొత్త ఆధారాలను పరిగణలోకి తీసుకోవాలని పిటీషన్ లో సిఐడి కోరింది. ఈ కేసునకు సంబంధించి సిఐడి కోర్టుకు ఆడియో ఆధారాలు అందజేసింది. రేపు వీడియోలు అందజేస్తామని వెల్లడించింది.

    అయితే ఈ కేసు విచారణను నవంబర్ 1 వాయిదా వేస్తూ న్యాయస్థానం తాజాగా తీర్పు చెప్పింది. కొత్త ఆధారాల నేపథ్యంలో కేసును పిఓపి చేయాలని సిఐడి మరో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్లను కోర్టు విచారించింది. కేసు రి ఓపెన్ చేయడం పైన ఏమైనా అభ్యంతరాలు ఉంటే కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటి జారీ చేసిన న్యాయస్థానం.. విచారణను మాత్రం వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకోవడం విశేషం. మాజీ మంత్రి నారాయణ కి సంబంధించిన ఆధారాలపైన తాజాగా ఆయన మరదలు కృష్ణప్రియ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. అసైన్డ్ భూముల వ్యవహారంలో నిబంధనలకు వ్యతిరేకంగా అమ్మకాలు, లావాదేవీలు జరిగినట్లు అభియోగాలు ఉన్నాయి. దీంతో ఈ కేసు తిరిగి విచారణ విషయంలో కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది.. సిఐడి వద్ద ఉన్న ఆధారాలు ఏంటి అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.