Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ ఆరో వారం నయని పావని ఎలిమినేట్ అయిన విషయం అందరికి తెల్సిందే. తనతో పాటు ఎవరూ ఊహించలేదు. అశ్విని,శోభా శెట్టి ,నయని ముగ్గురూ డేంజర్ జోన్ లో ఉన్నారు. కానీ వారి ఇద్దరిని సేవ్ చేశాడు బిగ్ బాస్. నయని ఎలిమినేట్ అవ్వడం తో చాలా భావోద్వేగానికి గురైయింది. స్టేజి పై అందరితో మాట్లాడుతూ ఎమోషనల్ అయింది. ఆమెతో పాటు హౌస్ మేట్స్ కూడా చాలా బాధపడ్డారు. ఇది అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అంటూ నెటిజన్స్ బిగ్ బాస్ ని తిట్టి పోస్తున్నారు.
నయని ఉంది ఒక్క వారమే అయినా అందరిని ఆకట్టుకుంది. ఇంత తక్కువ సమయంలోనే తన ఆటతో, మంచితనంతో ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. నయని స్ట్రాంగ్ కంటెస్టెంట్ కచ్చితంగా టాప్ 5 లో ఉంటుంది అని అంతా అనుకున్నారు, కానీ బిగ్ బాస్ ఆమెని అన్యాయంగా బయటికి తోసేశారు. ఇక నయని ఇంటికి వెళ్లాక ఆమెని పలకరించడానికి అనేక మంది వచ్చారు. ఆమెకి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ ఓదార్చారు.
ఆ తర్వాత ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ”నేనే కాదు ఎవ్వరు అనోకోలేదు,నేను వచ్చేప్పుడు కూడా .. మళ్ళీ వస్తావ్ అని అన్నారు.బిగ్ బాస్ వాళ్ళు నన్ను పంపించేయాలి అని అనుకుని ఉండరు. ఎందుకంటే నామినేషన్స్ బట్టి ఎలిమినేషన్ ఉంటుంది. జనాలు ఓట్లు వేసి గెలిపిస్తేనే హౌస్ లో ఉంటారు. అది నమ్మే బిగ్ బాస్ లోకి వెళ్ళాను. వాళ్ళు తీసుకునే నిర్ణయం జెన్యూన్ గా ఉంటుంది అనుకున్నాను.
వైల్డ్ కార్డు ఎంట్రీ తో వెళ్లడం కాస్త మైనస్ అయింది. ముందు నుంచే ఉండి ఉంటే ఇలా అయ్యుండేది కాదేమో” అని చెప్పుకొచ్చింది. శివాజీ గారు వెళ్లిపోయారా నాకు ఆ విషయం తెలియదు అంటూ బోరున ఏడ్చేసింది. నయని భాధ చూసి నెటిజన్స్ నీకు మేము ఉన్నాం బాధపడకు నయని అని సపోర్ట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఇలా చేసినందుకు బిగ్ బాస్ మీద ఫైర్ అవుతున్నారు ఆడియన్స్.