Uday Kiran: “చిత్రం” సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు హీరో ఉదయ్ కిరణ్. బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన స్టార్ ఈరో రేంజ్ కు ఎదిగాడు ఈ యంగ్ హీరో. ఉదయ్ నటించిన తొలి మూడు సినిమాలు చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే… బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. కాగా అనుకోని కారణాలతో కొన్నేళ్ళ తర్వాత ఉదయ్ కిరణ్ కెరీర్ తలకిందులు అయిపోయి సినిమా అవకాశాలు తగ్గాయి. ఆ తర్వాత విషిత అనే అమ్మాయిని ఉదయ్ పెళ్లి చేసుకున్నాడు. కొంతకాలం పాటు వీళ్ళ సంసార జీవితం సజావుగానే సాగింది. కానీ అనుకోని కారణాల రీత్యా వీరి మధ్య మనస్పర్ధాలు వచ్చాయని అంటున్నారు. దీంతో ఉదయ్ కిరణ్ ఆత్మ హత్య చేసుకొని ఈ లోకాన్ని వీడి తన కుటుంబ సభ్యులను, అభిమానులను శోక సంద్రంలో వదిలేసి వెళ్ళిపోయారు.
అయితే తాజాగా ఉదయ్ కిరణ్ చనిపోయిన ఏడేళ్ళ తర్వాత అతను చనిపోవడానికి ముందు రాసిన చివరి లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ లేఖలో “విషితా మా అమ్మ అంటే ఎంత ఇష్టమో… ఆ తర్వాత అంతటి స్థాయిలో నేను ప్రేమించిన అమ్మాయివి నువ్వు. అయితే మన మధ్య గొడవల కారణంగా అంకుల్, ఆంటీ చాలా బాధపడుతున్నారు. వారికి ఈ బాధ ఉండకూడదు. నువ్వు అతడు మంచి వాడు అని నమ్ముతున్నావు. కానీ అతడు మంచివాడు అస్సలు కాదు. నా మాట విను. నువ్వు నిజం తెలుసుకునే రోజు నీ పక్కన ఉదయ్ ఉండడు. నువ్వు ఒకసారి అమెరికాకు వెళ్లి వైద్యం చేయించుకో. నాకు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి. నన్ను ఓ మ్యాడ్‌గా చిత్రీకరించి ఆడుకుంది. మన మధ్య గొడవల కారణంగా చాలా మంది బాధ పడుతున్నారు. అందరూ సంతోషంగా ఉండాలంటే నేను ఉండకూడదు అనుకుంటున్నాను. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. మా అమ్మ నీకు ఇచ్చిన నగలను తిరిగి మా అక్కకు ఇవ్వు. వాటిని తను జాగ్రత్తగా దాచుకుంటుంది. అమ్మా నిన్ను ఓ సారి కౌగిలించుకుని ఏడ్వాలని ఉంది. అందుకే నీ దగ్గరికి వస్తున్నా” అని ఉంది. ఈ లేఖను చదివిన ఉదయ్ అభిమానులంతా ఆయనను గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యంతం అవుతున్నారు.