Hero Surya : ‘కంగువ’ లాంటి భారీ డిజాస్టర్ ఫ్లాప్ తర్వాత హీరో సూర్య(Suriya Sivakumar) నటించిన చిత్రం ‘రెట్రో'(Retro Movie). కార్తీక్ సుబ్బరాజ్(Karthik Subbaraj) దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రం మరో 5 రోజుల్లో మన ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా పూజ హెగ్డే నటించిన సంగతి తెలిసిందే. ఎన్నడూ లేని విధంగా ఈ సినిమాకు ఆమె ప్రొమోషన్స్ ఇరగదీస్తోంది. ఒక విధంగా ఈ సినిమా పై జనాల్లో హైప్ క్రియేట్ అవ్వడానికి పూజా హెగ్డే(Pooja Hegde) కూడా ఒక కారణం అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. ‘కన్నిమ్మ’ పాట ఎంత పెద్ద హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. యూట్యూబ్ లో ఈ పాటకు 40 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. మిగిలిన మ్యూజిక్ ప్లాట్ ఫారమ్స్ లో కూడా ఈ పాటకు సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ఇకపోతే నిన్న హైదరాబాద్ లో ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.
Also Read : ఆ కొడుకులకు చెప్పండి..కాశ్మీర్ మనది’..’రెట్రో’ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ కామెంట్స్!
ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథి గా విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) పాల్గొన్నాడు. సూర్య గురించి ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఆయన మాట్లాడుతూ ‘ముందుగా కాశ్మీర్ లో కాల్పులకు గురై ప్రాణాలను కోల్పోయిన అమాయకులందరి ఆత్మలకు శాంతి చేకూరాలని నేను ప్రార్థన చేస్తున్నాను. ఇక సినిమా విషయానికి వస్తే కార్తీక్ సుబ్బరాజ్ ఈ చిత్రాన్ని చాలా డిఫరెంట్ గా తెరకెక్కించాడు. ట్రైలర్ మీ అందరికీ బాగా నచ్చింది కదా. సినిమా కూడా అదే రేంజ్ లో ఉంటుంది. పూజ హెగ్డే ఈ సినిమాకు చేసిన ప్రొమోషన్స్ ని మర్చిపోలేను. కన్నిమ్మ పాట ఈరోజు ఇంత సక్సెస్ అయ్యిందంటే అందుకు కారణం పూజ హెగ్డే మాత్రమే. కచ్చితంగా ఈ చిత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది’ అంటూ సూర్య చెప్పుకొచ్చాడు.
‘సక్సెస్, ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా నా మీద అభిమానం, నమ్మకం ఎక్కడ కోల్పోకుండా నాకోసం అభిమానులు నిలబడ్డారు. అందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఇందాక విజయ్ మా అగారం ఫౌండేషన్ గురించి మాట్లాడిందండుకు చాలా సంతోషం. ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేయాలనే ఆలోచన నాకు మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) గారి బ్లడ్ బ్యాంక్ ని చూసిన తర్వాతనే కలిగింది. ఈ ఫౌండేషన్ నడపడానికి శక్తి ని ఇచ్చింది మీరే. ఇప్పటి వరకు ఈ ఫౌండేషన్ ద్వారా 8 వేల మందికి పైగా చదువుకున్నారు. NRI నుండి అభిమానులు ఈ సంస్థ పెరగడానికి విరాళాలు అందిస్తూ వస్తున్నారు. అందులో 30 శాతం మంది తెలుగు వాళ్ళు పంపిన విరాళాలు ఉన్నాయి. వేల మంది తమిళ విద్యార్థులు చదువుకోవడానికి తెలుగు వాళ్ళు సహాయ పడ్డారు’ అంటూ చెప్పుకొచ్చాడు సూర్య. అదే విధంగా తన తదుపరి చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వెంకీ అట్లూరి దర్శకత్వం లో చేయబోతున్నాని అధికారికంగా చెప్పుకొచ్చాడు.
