https://oktelugu.com/

Suhash: కొన్ని సీన్స్‌ చేసేటప్పుడు చాలా ఉద్వేగానికి గురయ్యాను: సుహస్

Suhash: కరోనా భయం లేదు కానీ ప్రస్తుత కాలంలో థియేటర్ లో కన్నా ఓటిటి ప్రాధాన్యత అధికంగా పెరిగిందని చెప్పవచ్చు. ప్రేక్షకులు కూడా ఈ ప్లాట్​ఫాంను ఎక్కువగానే ప్రోత్సహిస్తున్నారు. ఇటీవలే చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాలు సైతం ఓటిటి లోనే విడుదలవుతున్నాయి. ప్రస్తుత కాలంలో సినిమాలు, టాక్ షోలు ,వెబ్ సిరీస్, వంటి వాటికి కూడా ఓటిటి వేదిక అయ్యింది అయితే ప్రేక్షకుల నుండి కూడా మంచి ఆదరణ లభిస్తుంది అనే చెప్పాలి.   సుహాస్ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 3, 2021 7:51 pm
    hero-suhas-releaved-experience-at-shoot
    Follow us on

    Suhash: కరోనా భయం లేదు కానీ ప్రస్తుత కాలంలో థియేటర్ లో కన్నా ఓటిటి ప్రాధాన్యత అధికంగా పెరిగిందని చెప్పవచ్చు. ప్రేక్షకులు కూడా ఈ ప్లాట్​ఫాంను ఎక్కువగానే ప్రోత్సహిస్తున్నారు. ఇటీవలే చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాలు సైతం ఓటిటి లోనే విడుదలవుతున్నాయి. ప్రస్తుత కాలంలో సినిమాలు, టాక్ షోలు ,వెబ్ సిరీస్, వంటి వాటికి కూడా ఓటిటి వేదిక అయ్యింది అయితే ప్రేక్షకుల నుండి కూడా మంచి ఆదరణ లభిస్తుంది అనే చెప్పాలి.

     

    సుహాస్ కథానాయకుడిగా తెరకెక్కిన కలర్ ఫోటో తర్వాత హీరోగా తెరకెక్కిన చిత్రం “ఫ్యామిలీ డ్రామా” అయితే ఓటీటీ వేదిక సోని లివ్‌లో సుహస్ హీరో గా మెహెర్‌ తేజ్‌ తెరకెక్కించిన చిత్రం “ఫ్యామిలీ డ్రామా” ఇటీవలే విడుదలైంది.ఈ సినిమా లో పూజా కిరణ్‌,అనూష నూతుల,శ్రుతి మెహర్‌ , తేజ కాసరపు, తదితరులు నటించారు.ఈ మంగళవారం హైదరాబాద్‌లో విలేకర్ల ముచ్చటించారు సుహాస్‌.

    ఈ సినిమాలో నా పాత్రకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందని మొదటిలో కొంచెం భయంగా ఉంది ఆ తర్వాత ప్రేక్షకులనుండి మంచి ఆదరణ లభించింది అన్నారు.కొన్ని సీన్స్‌ చేసేటప్పుడు చాలా ఉద్వేగానికి గురయ్యాను. ప్రస్తుతం “రైటర్‌ పద్మభూషణ్‌’, ‘అంబాజీ పేట మ్యారేజ్‌ బ్యాండ్‌’వంటి చిత్రాలలో నటిస్తున్నా అని చెప్పారు. దర్శకుడు మెహెర్‌ తేజ్‌ మాట్లాడుతూ డార్క్‌ కామెడీ జానర్‌లో మన దగ్గర సినిమాలు రావడం తక్కువ. అందుకే ఈ జానర్‌లో సినిమా చేశా, కుటుంబ ప్రేక్షకులూ సైతం మా చిత్రాన్ని ఆదరిస్తున్నారు అంటూ చెప్పుకొచ్చారు.

    Tags