https://oktelugu.com/

Santosh Shoban: సినిమాలు ,వెబ్ సిరీస్ అనే వ్యత్యాసం ఉండదంటోన్న సంతోష్​ శోభన్​

Santosh Shoban: గోల్కొండ హైస్కూల్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమై.. పేపర్ బాయ్ చిత్రంతో హీరోగా ప్రేక్షక అభిమానుల గుర్తింపు దక్కించుకున్నారు. ఇటీవల సంతోష్ హీరోగా నటించిన ” ఏక్ మినీ కథ” చిత్రం ఓటిటి వేదికగా విడుదలై హిట్ అందుకుంది. ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సంతోష్​ శోభన్. సంతోష్​ శోభన్​, మెహ్రిన్​ జంటగా మారుతి దర్శకత్వంలో రానున్న చిత్రం ‘మంచి రోజులు వచ్చాయి’యూవీ క్రియేషన్స్‌ సంస్థ బ్యానర్ ఈ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 3, 2021 7:58 pm
    there-is-no-difference-between-movies-and-webseries-said-ek-mini-katha-hero-santhosh
    Follow us on

    Santosh Shoban: గోల్కొండ హైస్కూల్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమై.. పేపర్ బాయ్ చిత్రంతో హీరోగా ప్రేక్షక అభిమానుల గుర్తింపు దక్కించుకున్నారు. ఇటీవల సంతోష్ హీరోగా నటించిన ” ఏక్ మినీ కథ” చిత్రం ఓటిటి వేదికగా విడుదలై హిట్ అందుకుంది. ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సంతోష్​ శోభన్.

    సంతోష్​ శోభన్​, మెహ్రిన్​ జంటగా మారుతి దర్శకత్వంలో రానున్న చిత్రం ‘మంచి రోజులు వచ్చాయి’యూవీ క్రియేషన్స్‌ సంస్థ బ్యానర్ ఈ చిత్రానికి అనూప్​ రూబెన్స్ సంగీతం అందించారు ఈ సినిమాను దిపావళి కానుకగా ఈ గురువారం ప్రేక్షకులకు ముందు రానుంది .

    ఈ సందర్భంగా సంతోష్ శోభన్ ఒక ఛానల్ లో ముచ్చటిస్తూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.కరోనా సమయంలో పని దొరకడమే గగనం అయిన రోజులు అవి ఆ టైం లో ‘మంచి రోజులు వచ్చాయి’షూటింగ్‌ చేశాం భయాన్ని పక్కన పెట్టి ఉత్సాహంగా పనిచేశాం పైగా మారుతి గారి సినిమా, మారుతి గారి కామెడీ టైమింగ్‌ అంటే నాకు చాలా ఇష్టమని ఆయన సినిమాల్లోని డైలాగుల్ని నేనెక్కువగా ప్రాక్టీస్‌ చేసేవాడ్ని “ఏక్‌ మినీ కథ” ఆయనకు బాగా నచ్చిందట అందుకే పిలిచి ఈ కథ చెప్పారు అని చెప్పుకొచ్చారు

    చిన్నప్పటి నుండి నాటకాలు చూస్తూ నాటకాల్లో నటిస్తూ పెరిగిన వాడినని సినిమాలు ,వెబ్ సిరీస్ అనే వ్యత్యాసం ఉండదని ఎటువంటి పాత్రలోనైనా నటిస్తానని చెప్పుకొచ్చారు. కామెడీ ఎమోషనల్ ఒకే లా భావిస్తాను నేను స్వతహాగా సిగ్గరి కాస్త లిప్ లాక్ సన్నివేశాల్లో నటించడం ఇబ్బందిగా ఉంటుందని సినీ పరిశ్రమలో నేను సెటిల్‌ అయిపోయానని ఎప్పుడూ అనుకోను అని చెప్పుకొచ్చారు.