tapsi pannu: తాప్సీతో నటించేందుకు ఇష్టపడని స్టార్​ హీరో!

tapsi pannu: ఝుమ్మంది నాధం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్‏గా పరిచయమై.. సూపర్​ పాపులారిటీని సొంతం చేసుకున్న బ్యూటీ తాప్సీ పన్ను. ఆతర్వాత వరుసగా హిట్​ అందుకుంటూ అగ్ర కథానాయికల్లో ఒకరిగా స్థానం దక్కించుకుంది. అయితే, అటు తెలుగు సినిమాల్లో చేస్తూనే.. అకస్మాత్తుగా బాలీవుడ్​కు షిప్ట్​ అయ్యింది. ఈ క్రమంలోనే వైవిధ్యమైన చిత్రాలను చేస్తూ తనేంటో నిరూపించుకుంది. అలా అతి తక్కువ కాలంలోనే బాలీవుడ్​ టాప్​ హీరోయిన్లలో ఒకరిగా మారిపోయింది. మరోవైపు వెండితెరపైనే కాకుండా..డిజిటల్​రంగంలోనూ ఓ వెలుగు […]

Written By: Raghava Rao Gara, Updated On : November 3, 2021 7:30 pm
Follow us on

tapsi pannu: ఝుమ్మంది నాధం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్‏గా పరిచయమై.. సూపర్​ పాపులారిటీని సొంతం చేసుకున్న బ్యూటీ తాప్సీ పన్ను. ఆతర్వాత వరుసగా హిట్​ అందుకుంటూ అగ్ర కథానాయికల్లో ఒకరిగా స్థానం దక్కించుకుంది. అయితే, అటు తెలుగు సినిమాల్లో చేస్తూనే.. అకస్మాత్తుగా బాలీవుడ్​కు షిప్ట్​ అయ్యింది. ఈ క్రమంలోనే వైవిధ్యమైన చిత్రాలను చేస్తూ తనేంటో నిరూపించుకుంది. అలా అతి తక్కువ కాలంలోనే బాలీవుడ్​ టాప్​ హీరోయిన్లలో ఒకరిగా మారిపోయింది. మరోవైపు వెండితెరపైనే కాకుండా..డిజిటల్​రంగంలోనూ ఓ వెలుగు వెలిగిపోతోంది.

హీరోయిన్​గానే కాకుండా.. ప్రొడ్యూసర్​గానూ మారి సినిమాలను నిర్మించేందుకు సిద్ధమైంది. అయితే, తాజాగా తాప్సీ ఓ షాకింగ్​ కామెంట్స్​ చేసింది. హీరోయిన్లకు పేరు వచ్చే సినిమాల్లో నటించేందుకు చాలా మంది హీరోలు ఇష్టపడరని తెలిపింది. ఈ క్రమంలోనే సినిమాల్లో పురుషాధిక్యత గురించి మాట్లాడుతూ.. ఓ సినిమాలో తనది డబుల్​ రోల్​ అని.. అందులో  హీరో పాత్ర కోసం ఒక నటుడిని నిర్మాతలు సంప్రదించగా.. ఆ హీరో ఒప్పుకోలేదని చెప్పింది.

నిజానికి ఆయన తనతో అంతుకుముందే ఒక సినిమాలో నటించారని తెలిపింది. అతనొక పెద్ద స్టార్ అని కుడా పేర్కొంది. అయినప్పటికీ తనతో నటించడానికి ఆ హీరో అభద్రతగా ఫీల్ కావడం బాధాకరమని తెలిపింది. ప్రేక్షకుల మార్కులు హీరోయిన్ పాత్రకు పడతాయనే ఆ హీరో సినిమా చేయడానికి ఇష్టపడలేదని చెప్పి బాంబు పేల్చింది.