Homeటాప్ స్టోరీస్husband sold by wife real story: శుభలగ్నం సినిమాను ఎన్ని సార్లు చూసిందో.. ఏకంగా...

husband sold by wife real story: శుభలగ్నం సినిమాను ఎన్ని సార్లు చూసిందో.. ఏకంగా భర్తనే అమ్మేసింది..

husband sold by wife real story: అప్పట్లో వచ్చిన శుభలగ్నం సినిమా తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక ట్రెండ్ సెట్టర్. ఆ సినిమాలో ఆమని తన భర్త జగపతిబాబును రోజాకు అమ్మేస్తుంది. భర్తను మరొక యువతికి అమ్మడం అప్పట్లో చర్చకు దారి తీసింది. ఆ సినిమా మొత్తం ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ కావడంతో.. సూపర్ హిట్ సాధించింది. సినిమాలో కాస్త లిబర్టీస్ ఉంటాయి కాబట్టి.. దర్శకుడు నచ్చిన విధంగా కథను రాసుకుంటాడు. సన్నివేశాలు […]

husband sold by wife real story: అప్పట్లో వచ్చిన శుభలగ్నం సినిమా తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక ట్రెండ్ సెట్టర్. ఆ సినిమాలో ఆమని తన భర్త జగపతిబాబును రోజాకు అమ్మేస్తుంది. భర్తను మరొక యువతికి అమ్మడం అప్పట్లో చర్చకు దారి తీసింది. ఆ సినిమా మొత్తం ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ కావడంతో.. సూపర్ హిట్ సాధించింది.

సినిమాలో కాస్త లిబర్టీస్ ఉంటాయి కాబట్టి.. దర్శకుడు నచ్చిన విధంగా కథను రాసుకుంటాడు. సన్నివేశాలు కూడా సినిమాటిక్ మాదిరిగానే రూపొందిస్తాడు. కానీ అటువంటి సంఘటనలు నిజ జీవితంలో జరగడం సాధ్యం కాదు.

దశాబ్దాల క్రితం వచ్చిన శుభలగ్నం సినిమా ట్రెండ్ సెట్టర్ గా నిలిస్తే.. ఆ సినిమాను ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఒక మహిళ తన భర్తను అమ్మేసింది. ఈ సంఘటన దేశం మొత్తం మీద కలకలం రేపింది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నగరంలో ఓ 42 సంవత్సరాల వ్యక్తి.. 52 సంవత్సరాల మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. తనను, పిల్లలను నిర్లక్ష్యం చేస్తున్నాడని ఆ వ్యక్తి భార్య భోపాల్ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. దీంతో న్యాయస్థానం ఆ ముగ్గురికి కౌన్సిలింగ్ ఇచ్చింది. అయితే కౌన్సిలింగ్ ద్వారా కూడా సమస్య పరిష్కారం కాలేదు. దీంతో ఆ మహిళ తన భర్తను వదులుకోవడానికి సిద్ధపడింది.

ఆ మహిళ తన భర్తను వదులుకోవడానికి ఏకంగా 1.5 కోట్లు ఇవ్వాలని ప్రతిపాదన తీసుకొచ్చింది. దానికి ఆయన స్నేహితురాలు అంగీకరించింది. 1.5 కోట్ల నుంచి 27 లక్షల నగదు, ఇల్లు ఇవ్వాలని తన భార్యను.. ఆ భర్త కోరగా.. ఆమె ఒప్పుకుంది. ఇరవై ఏడు లక్షల నగదు, ఇల్లు తన కూతుర్ల భద్రత కోసం తీసుకున్నట్టు అతడు పేర్కొన్నాడు. ముగ్గురి మధ్య ఈ ప్రతిపాదన రావడం.. దానికి వారు ఒప్పుకోవడంతో కోర్టు కూడా ఆమోద ముద్ర వేసింది. ఓ తెలుగు దర్శకుడు తీసిన శుభలగ్నం ఇక్కడ సూపర్ హిట్ అయితే.. ఆ సినిమాలో కథ మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నగరంలో నిజంగా జరిగింది. దీనినే కార్యకారక సంబంధం అంటారేమో..

 

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper