https://oktelugu.com/

Akhanda: అప్పుడు జగ్గుభాయ్​ – ఇప్పుడు శ్రీకాంత్​.. బోయపాటి స్కెచ్​ ఇదేనా?

Akhanda: ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులను హీరోగా అలరించిన వారంతా.. ఇప్పుడు విలన్స్​గా, సపోర్టింగ్​ యాక్టర్స్​గా మారి మెప్పించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే హీరో నుంచి విలన్​గా మారిన వ్యక్తుల్లో ముందుంటారు జగపతి బాబు.  కుటుంబ కథా చిత్రాలతో మంచి కామెడీ ఉన్న కంటెంట్​ ఉన్న సినిమాలతో ప్రేక్షకులను అలరించిన హీరో జగపతి బాబు. అయితే, మధ్యలో కొంతకాలం వరకు సినిమాలకు దూరంగా ఉన్న జగ్గుభాయ్​.. బోయపాటి తెరకెక్కించిన లెజెండ్​ సినిమాతో విలన్​గా ఎంట్రీ ఇచ్చి అదరగొట్టాడు. ఇందులో […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 16, 2021 / 11:24 AM IST
    Follow us on

    Akhanda: ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులను హీరోగా అలరించిన వారంతా.. ఇప్పుడు విలన్స్​గా, సపోర్టింగ్​ యాక్టర్స్​గా మారి మెప్పించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే హీరో నుంచి విలన్​గా మారిన వ్యక్తుల్లో ముందుంటారు జగపతి బాబు.  కుటుంబ కథా చిత్రాలతో మంచి కామెడీ ఉన్న కంటెంట్​ ఉన్న సినిమాలతో ప్రేక్షకులను అలరించిన హీరో జగపతి బాబు. అయితే, మధ్యలో కొంతకాలం వరకు సినిమాలకు దూరంగా ఉన్న జగ్గుభాయ్​.. బోయపాటి తెరకెక్కించిన లెజెండ్​ సినిమాతో విలన్​గా ఎంట్రీ ఇచ్చి అదరగొట్టాడు.

    ఇందులో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన సంగతి తెలిసిందే. అయితే, విలన్​ క్యారెక్టర్​లో హీరోకు ఎక్కడా తగ్గకుండా ఇరగదీశారు జగపతి బాబు. ఆ తర్వాత వరుసగా విలన్​ పాత్రల్లో ఛాన్స్​లు కొట్టి ఫుల్ బిజీగా మారిపోయారు. తెలుగుతో పాటు, తమిళ్​ సినిమాల్లోనూ విలన్​గా మెప్పిస్తున్నారు.

    అయితే, ఇప్పుడు ఇదే బాటలో నడిచేందుకు హీరో శ్రీకాంత్ సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. శ్రీకాంత్​ కూడా బాలయ్య సినిమాతోనే విలన్​గా ప్రేక్షకులను పలకరించనున్నారు. గతంలో నాగచైతన్య హీరోగా వచ్చిన యుద్ధం శరణం సినిమాలో శ్రీకాంత్​ విలన్​గా కనిపించారు. అయితే, ఆ సినిమా ఆయనకు పెద్దగా బ్రేక్​ ఇవ్వలేదు. ఇప్పుడు జోయపాటి తెరకెక్కిస్తోన్న అఖండ సినిమా కోసం మరోసారి విలన్​ అవతారమెత్తారు శ్రీకాంత్​.

    ఇందులో పవర్​ఫుల్​ విలన్ పాత్రలో కనిపించనున్నారు. ఇటీవలే విడుదలైన అఖండ టీజర్​లో ఆ పాత్ర తాలుకు ఇంటెన్సిటీ కూడా క్లియర్​గా చూపించారు బోయపాటి. 100కు పైగా సినిమాల్లో నటించిన శ్రీకాంత్​కు విలన్​గా మెప్పించడం పెద్ద సమస్య కాదంటున్నారు విశ్లేషకులు. శ్రీకాంత్​ కూడా జగపతి బాబులాగే పూర్తిస్థాయి విలన్​ పాత్రలకు పరిమితం అవుతారేమో చూడాలి మరి.