Bheemla Nayak Movie: పవర్ స్టార్ అభిమానులకు గుడ్ న్యూస్… “భీమ్లా నాయక్” రిలీజ్ డేట్ ఎప్పుడంటే ?

Bheemla Nayak Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కలిసి నటిస్తున్న చిత్రం ‘భీమ్లా నాయక్’. సాగర్ కె చంద్ర  దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకి … తమన్ సంగీతం అందిస్తున్నారు. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ సినిమాకి రీమేక్ గా ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పవన్ కళ్యాణ్, రానా క్యారెక్టర్లు ప్రోమో లు , పాటలకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అయితే […]

Written By: Raghava Rao Gara, Updated On : November 16, 2021 11:23 am
Follow us on

Bheemla Nayak Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కలిసి నటిస్తున్న చిత్రం ‘భీమ్లా నాయక్’. సాగర్ కె చంద్ర  దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకి … తమన్ సంగీతం అందిస్తున్నారు. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ సినిమాకి రీమేక్ గా ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పవన్ కళ్యాణ్, రానా క్యారెక్టర్లు ప్రోమో లు , పాటలకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇప్పుడు తాజాగా ఈ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ ను చిత్ర బృందం ప్రకటించింది.

ఈరోజు భీమ్లా నాయక్ సినిమా సంగీత దర్శకుడు ఎస్.ఎస్ తమన్ బర్త్ డే సంధర్బంగా అభిమానులకు ఓ అప్డేట్ ను మూవీ యూనిట్ విడుదల చేసింది. ఈ  సినిమా రిలీజ్ డేట్ ను ఖరారు చేస్తూ ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12 న ఈ సినిమా  థియేటర్లలో సందడి చేయనున్నట్లు ప్రకటించారు.

https://twitter.com/MusicThaman/status/1460466047186661383?s=20

సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నిత్యామీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా… రానా సరసన సంయుక్త మీనన్  నటిస్తోంది. సంక్రాంతి కానుకగా ఆర్‌ఆర్‌ఆర్ సినిమాను జనవరి  7వ తేదీన విడుడ్లా చేయనున్నట్లు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చాడు జక్కన్న. ఈ నేపద్యంలో మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమా ఏప్రిల్ కు వాయిదా వేయగా… ఈ మూవీని కూడా వాయిదా వేస్తారని అంతా భావించారు. కానీ తగ్గేదే లే అనే విధంగా మూవీ రిలీజ్ డేట్ లో ఏ మార్పు లేదని ప్రకటించింది మూవీ యూనిట్. ఈ వార్తతో పవన్ అభిమానుల్లో ఫుల్ జోష్ నెలకొంది.