https://oktelugu.com/

Hardik Pandya: హార్ధిక్ పాండ్యాకు షాకిచ్చిన అధికారులు.. ఆ  రూ.5 కోట్ల వాచీల కథేంటి?

Hardik Pandya: దుబాయ్ వేదికగా ఐపీఎల్-2021, టీ-20 వరల్డ్ కప్ లాంటి మెగా ఈవెంట్స్ జరిగాయి. ఐపీఎల్ కోసం దుబాయ్ వెళ్లిన భారత క్రికెటర్లు ఆ వెంటనే వరల్డ్ కప్ ఉండటంతో కొంతమంది అక్కడే ఉండిపోయారు. కొందరు కుటుంబంతో గడిపి వరల్డ్ కప్ కోసం దుబాయ్ వెళ్లారు. ఐపీఎల్ ఈవెంట్ పాల్గొన్న Hardik Pandya వరల్డ్ కప్ కోసం అక్కడే ఉండిపోగా తాజాగా ఓ వివాదంలో ఇరుక్కుపోవడం చర్చనీయాంశంగా మారింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో హర్థిక్ పాండ్యా […]

Written By:
  • NARESH
  • , Updated On : November 16, 2021 / 11:43 AM IST
    Follow us on

    Hardik Pandya: దుబాయ్ వేదికగా ఐపీఎల్-2021, టీ-20 వరల్డ్ కప్ లాంటి మెగా ఈవెంట్స్ జరిగాయి. ఐపీఎల్ కోసం దుబాయ్ వెళ్లిన భారత క్రికెటర్లు ఆ వెంటనే వరల్డ్ కప్ ఉండటంతో కొంతమంది అక్కడే ఉండిపోయారు. కొందరు కుటుంబంతో గడిపి వరల్డ్ కప్ కోసం దుబాయ్ వెళ్లారు. ఐపీఎల్ ఈవెంట్ పాల్గొన్న Hardik Pandya వరల్డ్ కప్ కోసం అక్కడే ఉండిపోగా తాజాగా ఓ వివాదంలో ఇరుక్కుపోవడం చర్చనీయాంశంగా మారింది.

    Hardik Pandya

    కరోనా పరిస్థితుల నేపథ్యంలో హర్థిక్ పాండ్యా అక్కడే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఐపీఎల్ లో ఆకట్టుకున్న ఈ ఆల్ రౌండర్ టీ-20 వరల్డ్ కప్ లో మాత్రం పేలవ ప్రదర్శన చేశారు. జట్టుకు కావాల్సిన సమయంలో ఏమాత్రం ఉపయోగపడకుండా భారంగా మారాడు.

    హర్థిక్ పాండ్యాతోపాటుగా మిగతా ప్లేయర్లు సరైన రీతిలో ప్రదర్శన చేయలేదు. దీంతో భారత్ నాకౌట్ దశలోనే నిష్క్రమించాల్సి వచ్చింది.  2021 టీ 20 వరల్డ్ కప్ విజేతగా ఆస్ట్రేలియా జట్టు నిలిచింది. న్యూజిల్యాండ్ పై సూపర్ విక్టరీ కొట్టి తొలిసారి టీ-20 కప్ ను ఎగురేసుకొని పోయింది.

    ఇటీవలే టీ20 వరల్డ్ కప్ ముగియడంతో టీంఇండియా ప్లేయర్లు భారత్ కు తిరుగుముఖం పడుతున్నారు. దుబాయ్ నుంచి ముంబాయి వినాశ్రయానికి హర్థిక్ పాండ్యా సోమవారం చేరుకున్నాడు. ఈ సమయంలో కస్టమ్స్ అధికారులు అతడి బ్యాగ్ ను చెక్ చేయగా రూ.5కోట్ల విలువ చేసే రెండు వాచ్ లు ఉన్నట్లు గుర్తించారు.

    వీటిని సంబంధించిన సరైన పత్రాలను హర్థిక్ పాండ్యా చూపించకపోవడంతో కస్టమ్ అధికారులు ఆ రెండు వాచులను స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే గతంలోనూ హర్దిక్ పాండ్యా సోదరుడు కృనాల్ పాండ్యా వద్ద నుంచి సైతం ఇలాగే విదేశీ వాచులతోపాటు భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు. అప్పట్లో ఈ వార్త సంచలనంగా మారింది.

    అయితే తాజాగా హర్దిక్ పాండ్యా నుంచే కస్టమ్ అధికారులు అత్యంత ఖరీదైన వాచులను స్వాధీనం చేసుకోని చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై హర్దిక్ పాండ్యా తన ట్వీటర్లో వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. దుబాయ్ నుంచి ముంబాయి వచ్చిన వెంటనే తానే స్వయంగా కస్టమ్స్ అధికారులను కలిశానని చెప్పాడు.

    అక్కడి నుంచి తీసుకొచ్చిన వస్తువులను చూపించి కస్టమ్స్ చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పాడట. వీటికి సంబంధించిన రశీదులు అడగారని వాటన్నింటిని సమర్పిస్తానని కస్టమ్ అధికారులకు తెలిపినట్లు హర్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు. ఈ వాచ్ ఖరీదు రూ.5కోట్లు కాదని రూ.1.5కోట్ల మాత్రమేనని చెప్పాడు.

    కస్టమ్ సుంకం చెల్లించేందుకు తాను రెడీ ఉన్నానని అయితే తనపై కొందరు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డాడు. కాగా గతంలో ఇదే రీతిలో పట్టుబడిన హర్థిక్ సోదరుడు కృనాల్ ను పోలీసులు వదిలిపెట్టన నేపథ్యంలో హర్థిక్ సైతం బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే టాక్ విన్పిస్తోంది. మరీ ఈ వివాదం నుంచి Hardik Pandya ఎలా బయటపడుతారనేది మాత్రం సర్వత్రా ఆసక్తిని రేపుతోంది.