Akhanda: నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా అఖండ. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. సెన్సార్ కూడా కంప్లీ చేసుకుని విడుదలకు సిద్ధమైంది. డిసెంబరు 2న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యూఏ సర్టిఫికేట్‌ను ఇచ్చింది. కాగా, ప్రస్తుతం మిగిలున్న పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా పూర్తి చేసుకుంటూ ముందుకు దూసుకెళ్లిపోతోంది చిత్రబృందం.

కాగా, తాజాగా, ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న థమన్.. తాజాగా ఓ ఆసక్తికర అప్డేట్ను షేర్ చేసుకున్నారు. ఈ చిత్రం చివరి దశ డాల్బీ అండ్ డాల్బీ అట్మాస్ మిక్సింగ్ శరవేగంగా జరుగుతోందని ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. ఈ క్రమంలోనే దర్శకుడు బోయపాటితో కలిసి తీసుకున్న ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. కాగా, ఇటీవల విడుదలైన అఖండ ట్రైలర్ యూట్యూబ్‌ను ఓ షేక్ చేసింది.
మిలియన్ల వ్యూస్‌తో ముందుకు దూసుకెళ్లిపోతోంది. ఇందులో బీజీఎమ్ ఏ రేంజ్లో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరోవైపు, అఖండ టైటిల్ సాంగ్కూడా రోమాలు నిక్కబొడిచేలా ఉండటంతో ఈ సినిమా ఆల్బమ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో శ్రీకాంత్, జగపతి బాబు, ప్రగ్యా జైస్వాల్, పూర్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
ఇక ప్రస్తుతం బాలయ్య, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది. ఆలాగే ఆ తర్వాత యంగ్ దర్శకుడు అనిల్ రావిపూడితో కూడా బాలయ్య ఓ సినిమా చేయబోతున్నాడు. అదేవిధంగా కొరటాల శివతో కూడా సినిమా ఉంటుందని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది.