Sharwanand Game Changer: టాలీవుడ్ లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) కి ప్రతీ ఒక్కరితోనూ మంచి సాన్నిహిత్యం ఉంది. అల్లు అర్జున్ ఎలాగో తన కజిన్ కాబట్టి చిన్నప్పటి నుండి మంచి సాన్నిహిత్యం ఉంటుంది. అతనితో ఉన్నంత క్లోజ్ గానే ఎన్టీఆర్(Junior NTR) , ప్రభాస్(Rebel Star Prabhas), మహేష్ బాబు(Superstar Mahesh Babu) వంటి హీరోలతో ఉంటాడు రామ్ చరణ్. ఇక తన బాబాయ్ పవన్ కళ్యాణ్ తో ఉన్న సాన్నిహిత్యం గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. చిన్నప్పటి నుండి తన తండ్రి చిరంజీవి దగ్గర కంటే తన బాబాయ్ పవన్ కళ్యాణ్ వద్దనే రామ్ చరణ్ ఎక్కువగా పెరిగాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇండస్ట్రీ మొత్తం ఆయనకు స్నేహితులే, సన్నిహితులే. వీళ్లందరిలో రామ్ చరణ్ తనకు ఎంతో ప్రత్యేకమైన స్నేహితుడిగా శర్వానంద్(Sharwanand) ని భావిస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరిది నిన్న మొన్నటి స్నేహం కాదు, చిన్న తనం నుండి ఏర్పడిన స్నేహం.
ఒకే స్కూల్, ఒకే కాలేజ్ లో చదువుకుంటూ వీళ్ళ మధ్య రిలేషన్ ని ఈ స్థాయిలో బలపర్చుకున్నారు. అయితే శర్వానంద్ లేటెస్ట్ లుక్ ని చూసి సోషల్ మీడియా లో నెటిజెన్స్ ఆశ్చర్యానికి గురి అయ్యారు. ఇదేంటి ‘గేమ్ చేంజర్’ మూవీ ఫ్లాష్ బ్యాక్ లో రామ్ చరణ్ అప్పన్న గెటప్ లో శర్వానంద్ కనిపిస్తున్నాడు?, ఆ క్యారక్టర్ ని ఇమిటేట్ చేస్తూ తన కొత్త సినిమాలో ఏదైనా స్పూఫ్ చేస్తున్నాడా?, లేకపోతే ఇది పూర్తి గా తన కొత్త సినిమా కోసం ఏర్పాటు చేసుకున్న మేకోవర్ నా? అనేది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా వీళ్లిద్దరి గెటప్స్ ని పోల్చి చూస్తూ సోషల్ మీడియా లో ఇప్పుడు ట్వీట్స్ ఎక్కువ అయ్యాయి. శర్వానంద్ తన ఈ గెటప్ లో తన కొత్త సినిమా ప్రకటన రాబోయే రోజుల్లో చేస్తున్నాడా?, ఫ్యాన్స్ కి స్వీట్ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడా అనేది తెలియాల్సి ఉంది.
ఇకపోతే శర్వానంద్ ప్రస్తుతం యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో అభిలాష్ కంకర అనే కొత్త డైరెక్టర్ తో భారీ బడ్జెట్ చిత్రం చేస్తున్నాడు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ సినిమా తో పాటు ఆయన ‘నారి నారి నడుమ మురారి’ అనే చిత్రం చేస్తున్నాడు. ‘సామజవరగమనా’ ఫేమ్ రామ్ అబ్బరాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో సంయుక్త మీనన్ , సాక్షి వైద్య హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదలై మంచి రెస్పాన్స్ ని తెచ్చుకుంది. ఈ రెండు కాకుండా సంపత్ నంది దర్శకత్వం లో ‘భోగి’ అనే చిత్రం కూడా చేస్తున్నాడు. రీసెంట్ గా ‘గేమ్ చేంజర్’ అప్పన్న లుక్ ని తలపించింది అంటున్న శర్వానంద్ లేటెస్ట్ లుక్ ఆ సినిమా కోసమే అని నెటిజెన్స్ ఊహిస్తున్నారు. ఇది ఎంత వరకు నిజం అవుతుందో చూడాలి.