Sathya Dev: జ్యోతిలక్ష్మి సినిమాతో ప్రేక్షకులకు హీరో గా పరిచయం అయ్యారు సత్యదేవ్. ముకుంద, మిస్టర్ పర్ఫెక్ట్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి సినిమాల్లో నటించిన… ఆయనకు ప్రేక్షకులలో గుర్తింపు రాలేదు. నటన మీద మక్కువతో ఎటువంటి పాత్రలోనైనా నటిస్తున్నారు హీరో సత్యదేవ్.

మలయాళంలో ఫహద్ ఫాసిల్ హీరోగా తెరకెక్కిన “మహేశింటే ప్రతీకారం” మంచి విజయం దక్కించుకుంది. ఈ చిత్రాన్ని తెలుగులో “ఉమామహేశ్వర ఉగ్రరూపస్య ” అనే పేరుతో నిర్మించిన రీమేక్ లో నటించి … సత్యదేవ్ హిట్ అందుకున్నారు. ఇటీవలే తిమ్మరుసుతో చిత్రంతో ప్రేక్షకులను అలరించాడు సత్యదేవ్. అయితే తాజాగా బాలీవుడ్ లో అడుగు పెట్టనున్నారు హీరో సత్యదేవ్.
అక్షయ్ కుమార్, జాక్వెలైన్ ఫెర్నాండెజ్ జంటగా అభిషేక్ శర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ‘రామ్ సేతు’ చిత్రంలో సత్యదేవ్ కీలక పాత్ర పోషిస్తున్నాడట. ఈ మేరకు అక్షయ్ కుమార్, జాక్వెలైన్ ఫెర్నాండెజ్, సత్యదేవ్… ముగ్గురూ కలిసి ఉన్న ఫొటోను అక్షయ్ తన ట్వీటర్ ఖాతా ద్వారా షేర్ చేశారు.
In the photo – or in life – there’s always that beautiful streak of light above dark clouds. Wrapped the Ooty schedule of #RamSetu. Hope the divine light always guides us through thick and thin. 🙏🏻@Asli_Jacqueline @ActorSatyaDev pic.twitter.com/L6vWn2H7bB
— Akshay Kumar (@akshaykumar) October 22, 2021
ఈ సినిమాలో రామ్ అనే పాత్రలో అక్షయ్ కుమార్, సీత అనే పాత్రలో జాక్వెలైన్ ఫెర్నాండెజ్, లక్ష్మణ్ అనే పాత్రలో సత్యదేవ్, ఊర్మిళ అనే పాత్రలో నుస్రత్ బహుచా నటించనున్నారని వార్తలు వస్తున్నాయి. కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్, అబుండాంటియా ఎంటర్‌టైన్‌మెంట్, అమెజాన్ ప్రైమ్ వీడియో… లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్వహిస్తున్నాయి. ఈ చిత్రానికి అజయ్-అతుల్ ద్వయం సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా 2022 అక్టోబర్ 24వ తేదీన విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.