Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ “బాహుబలి” సినిమాతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నాడు. కెరీర్ పరంగా డార్లింగ్ ఫుల్ ఫామ్ లో ఉన్నాడనే చెప్పాలి. వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ… దూసుకు పోతున్నాడు. కాగా ఈరోజు తన 42వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు ప్రభాస్. ఈ సందర్భంగా ఆయనకు సెలబ్రిటీలు, అభిమానులు సోషల్ మీడియాలో సోషల్ మీడియా లో శుభాకాంక్షలు తెలియ జేస్తున్నారు. ఇరు తెలుగు రాష్ట్రాల్లో ప్రభాస్ బర్త్ డేని చాలా గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకుంటున్నారు ఆయన డై హర్డ్ ఫ్యాన్స్. ఈ మేరకు ఆయన అభిమానులంతా ఫ్లెక్సిలు కడుతూ, ఆయన కటౌట్ లకు పాలాభిషేకాలు చేస్తూ … అననదన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

రెబల్ స్టార్ కృషం రాజు నటవారసుడిగా ఈశ్వర్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు ప్రభాస్. వర్షం, ఛత్రపతి, డార్లింగ్ సినిమాలతో అమ్మాయిలకు డ్రిమ్ బాయ్ గా మారి … కేవలం 17 సినిమాలకే పాన్ ఇండియా స్టార్ గా ఎనలేని ఖ్యాతిని సంపాదించాడు. ఇదిలా ఉంటే… ప్రభాస్ కు సోషల్ మీడియాలో కూడా అభిమానులు ఎక్కువే అని చెప్పాలి. ఈ సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్… ప్రభాస్ కి ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చింది. ఎవ్వరూ ఊహించని విధంగా.. గ్లోబల్ స్టార్ ప్రభాస్ డే అంటూ కొత్త ఫిల్టర్ ను విడుదల చేశారు.

ఈ ఫిల్టర్ కు రాధేశ్యామ్ టీజర్‌లోని మ్యూజిక్‌ను అనుసందానం చేస్తూ రూపొందించారు. ప్రస్తుతం ఈ ఫిల్టర్ ఇన్ స్టాగ్రామ్ లో వైరల్ అవుతుంది. అభిమానులంతా ఈ ఫిల్టర్ తో రీల్స్ చేస్తున్నారు పోస్టు చేస్తున్నారు. తాజాగా విడుదలైన రాధే శ్యామ్ టీజర్ యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. మరో వైపు.. వరుసగా.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’, ఓం రౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ , అలాగే. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘ప్రాజెక్ట్-K’ , సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ చిత్రాల్లో నటిస్తున్నాడు ఈ గ్లోబల్ స్టార్.