The Warrior Movie First Review: ఎనెర్జిటిక్ స్టార్ రామ్ హీరో గా ఉప్పెన ఫేమ్ క్రితి శెట్టి హీరోయిన్ గా తమిళ స్టార్ డైరెక్టర్ లింగు సామి దర్శకత్వం లో తెరకెక్కిన ‘ది వారియర్’ చిత్రం ఈనెల 14 వ తేదీన తెలుగు మరియు తమిళ బాషలలో ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల అవ్వబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాలో ప్రముఖ హీరో ఆది పినిశెట్టి విలన్ గా నటించాడు..ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని విడుదల చెయ్యగా దానికి అభిమానుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది..ఇక దేవి శ్రీ ప్రసాద్ అందించిన పాటలు కూడా యూత్ మరియు మాస్ ఆడియన్స్ ని ఊపేస్తున్నాయి..ఇలా విడుదలకి ముందే ఫుల్ పాజిటివ్ బజ్ ని ఏర్పాటు చేసుకున్న ఈ సినిమా, విడుదల తర్వాత ఇక రేంజ్ లో ఉంటుందో అని అభిమానులు మరియు ట్రేడ్ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన ప్రివ్యూ ఇటీవలే ప్రసాద్ లాబ్స్ లో కొంతమంది ప్రముఖులకు ప్రత్యేకమైన స్క్రీనింగ్ వేసారట..దానికి సంబంధించిన రివ్యూ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది..ఇంతకీ ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేది ఒక చిన్న ఓవర్ వ్యూ ఇప్పుడు మనం ఆ ఆర్టికల్ లో విడుదలకు రెండు రోజుల ముందే చూడబోతున్నాము.
లింగు సామి సినిమాలన్నీ కూడా మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ తో నిండిపోయి ఉంటుంది..ఆయన దర్శకత్వం లో తెరకెక్కి తెలుగు లో డబ్ అయిన ఆవారా మరియు పందెం కోడి వంటి సినిమాలు ఇక్కడ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయో మన అందరికి తెలిసిందే..’ది వారియర్’ సినిమా కూడా అదే రేంజ్ లో ఉండబోతున్నట్టు సమాచారం..హీరో రామ్ ని పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా అద్భుతంగా చూపించాడట లింగు సామి..ఆసక్తికరమైన కథనం తో మంచి ఎలేవేషన్ సీన్స్ తో మాస్ ఆడియన్స్ కి పూనకాలు వచ్చే రేంజ్ లో ఆయన టేకింగ్ ఉందట.
Also Read: Bimbisara History: ఎవరీ బింబిసారుడు.. అతడి విజయ రహస్యం ఏంటి?
ముఖ్యం రామ్ మరియు ఆది పినిశెట్టి మధ్య వచ్చే పోరాట సన్నివేశాలు చూసే ప్రేక్షకులకు రోమాలు నిక్కపొడుచుకునే విధంగా ఉంటాయట..ఇక ‘విజిల్ విజిల్’ మరియు ‘బులెట్’ సాంగ్స్ ఆన్ స్క్రీన్ మీద అదిరిపోయాయట..మాస్ ఆడియన్స్ కి ఈ రెండు సాంగ్స్ కనుల పండగే అని చెప్పొచ్చు..ఇలా ఎన్నో ప్రత్యేకతలతో తెరకెక్కిన ఈ సినిమా మాస్ ఆడియన్స్ ని కచ్చితంగా అలరిస్తుంది అని ప్రివ్యూ షో నుండి వినిపిస్తున్న టాక్..మరి ఇందులో ఎంత మాత్రం నిజం ఉందొ తెలియాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే.
Also Read:Surya – Dulquer Salmaan: క్రేజీ డైరెక్టర్ తో సూర్య – దుల్కర్ సల్మాన్ మూవీ