Sivatmika: సీనియర్ హీరో రాజశేఖర్ ఇద్దరు కుమార్తెలలో పెద్ద కుమార్తె శివానీ కంటే చిన్నకుమార్తె శివాత్మికకే ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి. శివాత్మిక రాజశేఖర్ మంచి నటి. పైగా సెట్ లో చాలా క్రమశిక్షణతో ఉంటుంది. అలాగే ఆమె ఎలాంటి డిమాండ్ లు చేయదు. సింపుల్ గా సెట్ కి వస్తోంది. అన్నిటికి మించి లేనిపోని హడావుడి ఆమెకు సరిపడదు. మొత్తానికి తన తల్లిదండ్రుల నటనా వారసురాలిగా మొట్ట మొదట చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టి మంచి గుర్తింపు తెచ్చుకుంది శివాత్మిక. ఇప్పుడు శివాత్మిక సినిమాల లిస్ట్ రోజురోజుకు పెరుగుతూ పోతూ ఉంది.
ఆమె సినిమాల ఎంపిక చాలా బాగుంది అంటున్నారు. ముఖ్యంగా కృష్ణవంశీ ‘రంగ మార్తాండ’లో కీలక పాత్రలో నటిస్తోంది శివాత్మిక. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణలకు పోటీగా ఆమె పాత్ర ఉంటుందట. అయితే, సెకెండ్ హాఫ్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ లో శివాత్మిక నటనే ఎక్కువ హైలైట్ అయిందని తెలుస్తోంది. అందుకే, ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ శివాత్మికతో ఒక సోలో సినిమా చేయడానికి కసరత్తులు చేస్తోంది.
Also Read: The Warrior Movie First Review: ది వారియర్’ మొట్టమొదటి రివ్యూ
అమెరికా పోయిన ఓ పల్లెటూరి అమ్మాయి అక్కడ ఎన్ని ఇబ్బందులు పడింది, అలాగే ప్రేమించిన వాడు మోసం చేసి తల్లిని చేస్తే.. గర్భవతిగా అమెరికాలో ఆమె ఎన్ని బాధలు పడిందనే కోణంలో ఈ సినిమా ఉంటుందట. మొదట ఈ పాత్రకు సాయి పల్లవిని అనుకున్నారు. అయితే, ‘రంగ మార్తాండ’ ఫుటేజ్ చూసిన తర్వాత.. శివాత్మిక అయినా కూడా ఆ పాత్రకు పూర్తి న్యాయం చేయగలదు అని ఆమెను ఎంపిక చేశారట.
పైగా శివాత్మిక అయితే చాలా ఫ్రెష్ గా ఉంటుంది. దొరసాని సినిమాతో చిత్ర పరిశ్రమకు పరిచయం అయిన శివాత్మిక, ఆ సినిమాతోనే మంచి పేరు తెచ్చుకుంది. దాంతో శివాత్మిక రాజశేఖర్ మంచి నటి అని ఇండస్ట్రీలో పాజిటివ్ టాక్ వచ్చింది. అలాగే ప్రస్తుతం చేస్తోన్న ‘పంచతంత్రం’ సినిమాలో కూడా శివాత్మిక నటన అద్భుతంగా ఉంటుందట.
ఈ సినిమా షూటింగ్ సమయంలోనే తమిళ దర్శకుడు బాల శివాత్మిక నటన చూసి.. తమిళంలో తెరకెక్కుతున్న ‘ఆనందం విలయదుం వీడు’ అనే సినిమాలో ఆమెనే హీరోయిన్ గా రికమండ్ చేశాడు. మొత్తానికి శివాత్మిక లిస్ట్ పెరిగింది.
Also Read:Bimbisara History: ఎవరీ బింబిసారుడు.. అతడి విజయ రహస్యం ఏంటి?